ETV Bharat / sitara

Movie Updates: బంగార్రాజు డైరీ బ్యూటీ.. సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్​

author img

By

Published : Nov 19, 2021, 6:32 PM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. 'బంగార్రాజు' డైరీ అందంతో పాటు సూర్య కొత్త సినిమా రిలీజ్ డేట్ విషయాలు ఇందులో ఉన్నాయి. హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్​బర్గ్, బాలీవుడ్​​ రణ్​బీర్ కపూర్ కొత్త సినిమా విడుదల తేదీలు కూడా తెలుసుకోండి.

movie updates
మూవీ అప్​డేట్స్​

'సోగ్గాడే చిన్నినాయన'కు(Nagarjuna movies) కొనసాగింపుగా రూపొందుతున్న చిత్రం బంగార్రాజు. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి ఇందులో నటిస్తున్నారు. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ చిత్రంలో బంగార్రాజు డైరీకి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. అందులో నాగలక్ష్మీ పాత్ర పోషిస్తున్న కృతిశెట్టిని పరిచయం చేసింది. 'బంగార్రాజు డైరీలో ఇంత అందం దాగుందా?' అని రాసుకొచ్చింది.

ఈనెల 2న ఓటీటీ విడుదలైన 'జై భీమ్‌'తో మంచి విజయాన్ని అందుకున్న తమిళ నటుడు సూర్య.. మరో మూడు నెలల్లో 'ఎత్తర్కుమ్‌ తునింధవన్‌' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదల కానుంది. ఇదే విషయాన్ని ట్విట్టర్‌ వేదికగా తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేసింది నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌. తెల్ల పంచె, చొక్కా ధరించి మాస్‌ బీట్‌కు అదిరిపోయే డ్యాన్స్‌ స్టెప్స్‌ వేస్తూ ఈ వీడియోలో కనిపించారు సూర్య. యాక్షన్‌ థ్రిల్లర్‌లో సాగే ఈ చిత్రానికి పాండిరాజ్‌ దర్శకత్వం వహించారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది.

suriya new movie
ఎత్తర్కుమ్‌ తునింధవన్‌లో సూర్య
suriya new movie
ఎత్తర్కుమ్‌ తునింధవన్‌లో సూర్య

బాలీవుడ్ నటుడు రణ్​బీర్ కపూర్, 'అర్జున్ రెడ్డి' ఫేం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం 'యానిమల్'​. ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదల కానుందని చిత్రబృందం ప్రకటించింది. క్రైమ్ డ్రామాగా తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని టీ-సిరీస్​ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అనిల్ కపూర్​, బాబీ డియోల్​, పరిణితీ చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ranbir kapoor
రణ్​బీర్ కపూర్​

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్​ రూపొందించిన 'వెస్ట్ వైడ్ స్టోరీ' మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా? అని అభిమానులు చాలా రోజుల నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రిలీజ్​ డేట్​ను ప్రకటించింది చిత్ర బృందం. డిసెంబరు 10న దేశవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుందని చెప్పింది. ఈ మేరకు '20th సెంచరీ స్టూడియోస్'​ ఇన్​స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. 1957నాటి న్యూయార్క్ నగరంలో జరిగిన ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది.

ఇదీ చూడండి: 'బీటెక్​ కూడా అయిపోతోంది.. RRR మాత్రం రిలీజ్ కాలేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.