Maheshbabu brother died: రమేశ్‌బాబుకు కన్నీటి వీడ్కోలు
Updated on: Jan 9, 2022, 1:32 PM IST

Maheshbabu brother died: రమేశ్‌బాబుకు కన్నీటి వీడ్కోలు
Updated on: Jan 9, 2022, 1:32 PM IST
Ramesh babu died: సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు అంత్యక్రియలు ముగిశాయి. కరోనా పరిస్థితుల కారణంగా అతికొద్ది మంది సమక్షంలో దహస సంస్కారాలు జరిపారు.
Maheshbabu brother died: అనారోగ్యంతో కన్నుమూసిన సూపర్‌స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేశ్‌బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రమేశ్ కుమారుడు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా పరిస్థితుల వల్ల అతి కొద్దిమంది సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
అంతకుముందు రమేశ్ భౌతికకాయం సందర్శనార్థం పద్మాలయ స్టూడియోలో ఉంచారు. అక్కడికి కృష్ణ కుటుంబసభ్యులు సహా నరేశ్, సుధీర్‌బాబు, మంచు విష్ణు, మురళి మోహన్, కోటా శ్రీనివాసరావు, నిర్మాత తమ్మిరెడ్డి భరద్వాజ్ తదితరులు వచ్చి నివాళులు అర్పించారు. కరోనా సోకడం వల్ల మహేశ్‌బాబు రాలేకపోయారు.
కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేశ్ శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
'అల్లూరి సీతారామరాజు' (1974) చిత్రం ద్వారా వెండితెర ప్రవేశం చేశారు రమేశ్‌బాబు. కృష్ణ, మహేశ్‌బాబుతో కలిసి పలు సినిమాల్లో నటించారు. సుమారు 15 చిత్రాల్లో ఆయన కీలకపాత్రలో పోషించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేశ్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. 'అర్జున్', 'అతిథి' సినిమాలు నిర్మించారు.
ఇదీ చూడండి: నటుడు మహేశ్‌బాబు సోదరుడు రమేశ్‌బాబు కన్నుమూత
