ETV Bharat / sitara

ప్రేయసితో స్టార్​ నటుడి నిశ్చితార్థం

author img

By

Published : Nov 14, 2021, 12:11 PM IST

rajkumar rao
రాజ్​కుమార్​ రావు

బాలీవుడ్​ నటుడు రాజ్​కుమార్​ రావుకు తన ప్రేయసి, నటి పత్రలేఖతో నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్​ అవుతున్నాయి.

తన చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి పత్రలేఖతో బాలీవుడ్​ నటుడు రాజ్​కుమార్​ రావు నిశ్చితార్థం జరిగింది. చంఢీఘర్​లో ఈ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్​ అయ్యాయి. రాజ్​కుమార్​ తన మోకాలి మీద కూర్చొని ఆమెకు రింగ్​ తొడిగాడు. అనంతరం వీరిద్దరూ కలిసి డ్యాన్స్ వేశారు.

దాదాపుగా ఏడేళ్ల నుంచి రాజ్​కుమార్​, పత్రలేఖ డేటింగ్​లో ఉన్నారు. అయితే ఎప్పుడు తమ బంధంపై అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజులుగా వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో తాము వివాహం చేసుకోబోతున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అయితే ఎప్పుడనేది చెప్పలేదు.

ఇదీ చూడండి: బుల్లెట్​ స్పీడ్​లో అక్షయ్.. ఒకేసారి 9 చిత్రాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.