ETV Bharat / sitara

'15 ఏళ్ల ముందే ఆ సీన్ రెడీ​.. వర్కౌట్​ కాదన్నారు.. కానీ ఇప్పుడు చూడండి!'

author img

By

Published : Mar 20, 2022, 12:00 PM IST

Rajamouli Special Interview
ఆర్ఆర్​ఆర్

Rajamouli Special Interview: దర్శకుడు రాజమౌళి నుంచి కొత్త చిత్రం వస్తుందంటే.. అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. ఇప్పటివరకు ఆయన 11 సినిమాలు తీస్తే.. అన్నీ హిట్టే. అందుకే.. మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆర్​ఆర్​ఆర్ మూవీపైనా భారీ అంచనాలున్నాయి. మరి అలాంటి దర్శక దిగ్గజం.. కొన్ని సీన్లు బాలేవంటూ ఎవరైనా సలహా ఇస్తే ఏం చేస్తారు? ఆ సమయంలో ఎలా ఆలోచిస్తారు?

Rajamouli Special Interview: రాజమౌళి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఆయన తెరకెక్కించే సినిమాలు.. అందులోని ప్రతి సన్నివేశం ఓ అద్భుతం. ఆయన చిత్రాల్లోని ప్రతి ఫ్రేమూ ప్రేక్షకులను ఊహాలోకంలో విహరింపచేస్తుంది. అయితే.. జక్కన్న సినిమా తీసే క్రమంలో ఎలా ఆలోచిస్తారు? ఇతరుల సలహాలు తీసుకుంటారా? లేదా? అనే పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు జవాబులను గతంలో ఈటీవీ యువభారత్​కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ససేమిరా..

"నా సినిమా విజయవంతమవ్వడానికి కారణం నా రేషనాలిటీ. కథలో ఓ సన్నివేశం లేదా పాయింట్​ గొప్పగా అనిపిస్తుంది. దాన్ని సెంట్రల్​ ఐడియా అంటాం. కథను డెవలెప్ లేదా మేకింగ్​ చేసేటప్పుడు ఓ సన్నివేశం తెరకెక్కించే విషయంలో నేను చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటా. ఎవరైనా వచ్చి ఆ సన్నివేశం మార్చాలని సలహా ఇస్తే అస్సలు ఒప్పుకోను. 'ఆ సీన్​ ఎవరూ చూడరు?', 'వర్కౌట్​ అవ్వదు' అని అంటుంటారు. కానీ అవి పట్టించుకోను. ఒకవేళ ఏదైనా తేడాగా ఉందని నాకు అనిపిస్తే మాత్రం తప్పకుండా ఇతరుల సూచనలు తీసుకుంటా" అని తెలిపారు జక్కన్న.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రోల్​మోడల్స్​ ఎవరైనా ఉన్నారా?

"ప్రతి మనిషిలో పాజిటివ్, నెగిటివ్ రెండూ ఉంటాయి. అందుకే నాకు రోల్​ మోడల్ అంటూ ఎవరూ లేరు" అని చెప్పారు రాజమౌళి.

ఆ కళలో ప్రావీణ్యం..

దర్శకుడు రాజమౌళి సినిమా అంటేనే ఏదో కొత్తదనం మనముందుకు వస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఓ కథను చూపించే ప్రయత్నం ఎంతో భిన్నంగా, ఆసక్తిగా ఉంటుంది. కానీ తనలో చిన్ననాటి నుంచే ఓ కథను ఆసక్తికరంగా చెప్పే కళ ఉందని వెల్లడించారు రాజమౌళి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"మా అమ్మమ్మ దగ్గర చాలా తెలుగు పుస్తకాలు.. పంచతంత్రం, బాలరామాయణం, బాలభారతం ఇలా పిల్లలకు సంబంధించిన ఎన్నో కథల పుస్తకాలు ఉండేవి. నేను చాలా పుస్తకాలు చదివేవాడిని. మా పాఠశాలలో ఎక్స్​ట్రా కరిక్యులర్​ యాక్టివిటీస్​ జరిగేవి. సాధారణంగా ఈ క్లాస్​లో డ్యాన్సింగ్​, సింగింగ్​ ఇంకేదైనా పిల్లల కోసం ఉంటాయి. కానీ నేను రెండు, మూడు, నాలుగో తరగతులు చదివేటప్పుడు మా స్కూల్​లో శనివారం ఎక్స్​ట్రా కరిక్యులర్​ యాక్టివిటీస్ అంటే రాజమౌళి స్టోరీ టెల్లింగ్. హ్యాండ్​ రైటింగ్​ క్లాస్​ అయిపోగానే అందరూ నావైపు చూస్తారు. నేను వెళ్లి నిల్చొని నేను చదివిన కథలను చెప్పేవాడిని.​ ఆ కథలో నాకు ఏదైనా నచ్చకపోతే అందులో మార్పులు చేసి నాకు నచ్చిన విధంగా చెప్పేవాడిని."

-రాజమౌళి, దర్శకుడు.

15 ఏళ్ల క్రితమే ఆ సీన్..

ఇప్పటివరకు రాజమౌళి 11 సినిమాలు తీస్తే.. అన్నీ విజయవంతం అయ్యాయి. దీన్ని బట్టే ఆయన స్టామినా ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అయితే సినిమాలతో రాజమౌళి హిట్లు, బ్లాక్​బస్టర్లు కొట్టే విషయంలో కథారచయిత, తన తండ్రి విజయేంద్రప్రసాద్ స్థానం ప్రత్యేకం. ఆయన అద్భుతంగా స్టోరీ రాస్తే, దానిని అంతకంటే అద్భుతంగా తెరకెక్కించి, ప్రేక్షకులను ఊహాలోకంలో విహరించేలా చేసేవారు రాజమౌళి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వీరి కాంబినేషన్​లో వచ్చిన రామ్​చరణ్​- 'మగధీర' అయితే అప్పట్లో టాలీవుడ్​ రికార్డులను తిరగరాసింది. అందులో 100 మందిని చంపే సీన్​ ఇప్పుడు చూసినా సరే రోమాలు నిక్కబొడుచుకోవడం(గూస్​బంప్స్) ఖాయం.

మగధీరలో కాలభైరవ(రామ్​చరణ్​) 100 మందిని చంపే సీన్ అల్టిమేట్​. అప్పటివరకు వచ్చిన సినిమాల్లోకెల్లా ది బెస్ట్​గా నిలిచింది. అయితే అంతకు 15 ఏళ్ల క్రితమే తన తండ్రి ఈ సీన్​ను రాశారని రాజమౌళి 2011లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. దానిని పట్టుకొని ఓ డైరెక్టర్​ దగ్గరకు వెళ్తే ఇలాంటివి ఎవరు చూస్తారంటూ మాట్లాడారని అన్నారు. తానే దర్శకుడిగా మారిన కొన్నాళ్లకు ఆ కథను 'మగధీర'గా తెరకెక్కించినట్లు చెప్పారు.

ఆర్​ఆర్​ఆర్​..

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్​ఆర్​ఆర్​ చిత్రం మార్చి 25న విడుదల కానుంది. ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రూ.450 కోట్ల భారీ బడ్జెట్​తో రూపొందిన ఆర్​ఆర్​ఆర్​ చిత్రంలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్​ హీరోయిన్లు. అజయ్​ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.

ఇదీ చదవండి: చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు.. చరణ్​కు తెలియదు: రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.