ETV Bharat / sitara

మహేశ్​బాబు- రాజమౌళి చిత్రంలో ఆలియాభట్​..!

author img

By

Published : Mar 7, 2022, 10:33 PM IST

Rajamouli And Mahesh babu Movie: రాజమౌళి- మహేశ్​బాబు చిత్రంలో కథానాయికగా ఆలియాభట్​ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

Rajamouli And Mahesh babu
మహేశ్​బాబు- రాజమౌళి చిత్రం

Rajamouli And Mahesh babu Movie: మహేశ్​బాబు- రాజమౌళి కాంబినేషన్​లో చిత్రం కోసం అటు మహేశ్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడాఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే 'ఆర్​ఆర్​ఆర్​' తర్వాత తన సినిమా మహేశ్​తోనే ఉంటుందని దర్శకధీరుడు రాజమౌళి ఎప్పుడో ప్రకటించేశారు. తెలుగుతోపాటు దాదాపు అన్ని భారతీయ భాషల్లోనూ ఈ చిత్రం తెరకెక్కుతుందని ఇటీవల మహేశ్​ బాబు కూడా చెప్పారు.

అయితే ఈ భారీ బడ్జెట్​ చిత్రంలో మహేశ్​ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియాభట్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్​' చిత్రంలో నటించారు అలియా.

తన బాలీవుడ్ ఎంట్రీపై మహేశ్ ఇటీవల స్పందించారు. "నేనెప్పుడూ సరైన సమయంలో సరైన సినిమాలే చేస్తాను. హిందీలో సినిమా చేయడానికి ఇదే సరైన సమయం. నా తర్వాత సినిమా రాజమౌళితో చేస్తున్నా. ఇది అన్ని భాషల్లో ఉంటుంది" అని మహేశ్​బాబు, ఫోర్బ్స్​ ఇండియా ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమధానమిస్తూ ఇలా చెప్పారు.

ఇక మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' మార్చి 12న విడుదల కానుంది. ఈ చిత్రంతోపాటు త్రివిక్రమ్​ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నారు మహేశ్​బాబు.

ఇదీ చూడండి: ఇన్​స్టాగ్రామ్​ ఖాతాను డిలీట్​ చేసిన నిహారిక.. కారణం అదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.