ETV Bharat / sitara

సెప్టెంబరు నుంచి ప్రభాస్​ 'రాధే శ్యామ్'

author img

By

Published : Aug 23, 2020, 5:51 PM IST

Updated : Aug 23, 2020, 5:56 PM IST

డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్' షూటింగ్​ పునః ప్రారంభంపై దర్శకుడు రాధాకృష్ణ స్పష్టతనిచ్చారు. సెప్టెంబరు రెండో వారం నుంచి మొదలవుతుందని ట్వీట్ చేశారు.

Prabhas's Radhe Shyam shooting to start in September
ప్రభాస్​

భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోల్లో ఒకడిగా రెబల్​స్టార్​ ప్రభాస్ గుర్తింపు తెచ్చుకున్నారు​. 'బాహుబలి'తో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అనంతరం 'సాహో'తో మెప్పించారు. ప్రస్తుతం 'రాధే శ్యామ్​'లో నటిస్తున్నారు. ఇటీవలే సినిమా టైటిల్​తో పోస్టర్​ విడుదల చేసిన చిత్రబృందం.. అభిమానుల కోసం మరో శుభవార్త తీసుకొచ్చింది. సెప్టెంబరు రెండో వారం నుంచి తిరిగి షూటింగ్​ ప్రారంభమవుతుందని దర్శకుడు రాధాకృష్ణ ట్వీట్ చేశారు.

లాక్​డౌన్​కు ముందు విదేశాల్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఇందులో పూజాహెగ్డే కథానాయిక. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో వేసవిలో విడుదల కానుంది. ఇందులో జగపతిబాబు, సత్యరాజ్‌, భాగ్యశ్రీ, జయరాం, మురళీ శర్మ, ప్రియదర్శి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

మరోవైపు నాగ్​అశ్విన్​ దర్శకత్వంలోనూ సినిమా చేయనున్నారు ప్రభాస్​. డిసెంబరు నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రంలో దీపికా పదుకొణె హీరోయిన్. దీనితో పాటే 'ఆదిపురుష్'​లోనూ నటించనున్నారు.

Last Updated : Aug 23, 2020, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.