డార్లింగ్ ప్రభాస్ 'ఆదిపురుష్'(adipurush release date) నుంచి అప్డేట్ వచ్చింది. సినిమా రిలీజ్ డేట్‌పై స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది ఆగస్టు 11నే త్రీడీలో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఓ పోస్టర్‌ను కూడా పోస్ట్ చేశారు.
![prabhas adipurush release date](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13184503_adipurush-3.jpg)
రామాయణం ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా(adipurush cast), కృతి సనన్ సీత పాత్రలో(adipurush heroine) కనిపిస్తారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రలో దర్శనమివ్వనున్నారు.
బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్(adipurush director) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీ సిరీస్-రెట్రో ఫిల్స్ ప్రొడక్షన్ సంయుక్తంగా 'ఆదిపురుష్'ను(adipurush budget) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. దీనిని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
![prabhas adipurush cast](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13184503_adipurush-2.jpg)
దీనితో పాటే ప్రభాస్ మరో మూడు సినిమాలు చేస్తున్నారు. అందులో 'రాధేశ్యామ్'.. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. 'సలార్' షూటింగ్ దశలో ఉంది. ఇది కూడా వచ్చే ఏడాది ద్వితియార్ధంలో రిలీజ్ చేసే అవకాశముంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు-K'(వర్కింగ్ టైటిల్)లోనూ ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ కథతో ఇది తెరకెక్కుతోంది.
ఇవే కాకుండా పలువురు దర్శకులు ప్రభాస్‌కు కథ చెప్పి, సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అవన్నీ ప్రస్తుతం చర్చల దశలోనే ఉన్నాయి.
ఇవీ చదవండి: