ETV Bharat / sitara

ఓటీటీలో ఆ 'స్టోరీ'ల​కు ఎందుకంత క్రేజ్?​

author img

By

Published : Aug 6, 2021, 10:00 AM IST

Updated : Aug 6, 2021, 11:04 AM IST

కరోనా కారణంగా ఓటీటీల్లోనే చాలావరకు సినిమాలు, వెబ్ సిరీస్​లు రిలీజ్ అవుతున్నాయి. ఒక్కో చిత్రం ఒక్కో కంటెంట్​తో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంటోంది. అన్నింటికన్నా పొలిటికల్ స్టోరీలకు రెస్పాన్స్ బాగా వస్తోంది! వాటికే ఎందుకంత క్రేజ్? ఆ జానర్​లో వచ్చి ప్రేక్షకాదరణ పొందిన సినిమాలేవి?

Political content popular on OTT
ఓటీటీ

'రాజకీయం'.. ప్రజలను చాలా ప్రభావితం చేసే అంశం. పేపర్​, టీవీ.. ఎందులో వచ్చినా సరే దానిని చాలా ఆసక్తిగా చూస్తారు, చదువుతారు. మరి పొలిటికల్​ డ్రామాతో వెబ్​సిరీస్​లు, సినిమాలు తీస్తే ఊరుకుంటారా? అంతే ఇష్టంగా వీక్షిస్తారు. ఇలాంటి కొన్ని కథలు ఓటీటీ ఫ్లాట్​ఫామ్​కు కొత్త రంగులద్దుతున్నాయి. డిజిటల్​లో ఈ తరహా కంటెంట్​ పెరిగేకొద్ది ఇలాంటి సినిమాలు తీయడానికి నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.

అభిరుచి ఎక్కువ..

మన ప్రజలు పొలిటికల్ అంశాలపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఎందుకంటే ఇంత ఎక్కువ జనాభా కలిగిన దేశంలో ప్రతి అంశం జనజీవనంపై ప్రభావం చూపిస్తోంది. ఈ కారణంగానే దర్శకులు ఈ రకమైన సినిమాలు తీస్తున్నారు. అద్భుతమైన సక్సెస్​ను అందుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన 'తాండవ్​', 'సిటీ ఆఫ్ డ్రీమ్స్​', 'మేడమ్​ చీఫ్​ మినిస్టర్​' ఈ కోవలోకే వస్తాయి.

thandav
తాండవ్​

వివాదాస్పదమైనా..

ఈ పొలిటికల్​ కంటెంట్​ సమాజంలో ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తోంది. తమ అభిమాన రాజకీయ నాయకుల నిజజీవితాలు, నమ్మే సిద్ధాంతాలపై వస్తున్న చిత్రాలతో ప్రజలు రియాక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో కొన్ని చిత్రాలు/సిరీస్​లు వివాదాస్పదం కూడా అయ్యాయి. అందులో తాండవ్​ ఒకటి. హిందూ సిద్ధాంతాలను కించపరుస్తూ ఈ వెబ్ సిరీస్​ ఉందని పలు రాజకీయ పార్టీలు నిరసన తెలిపాయి.

medam chief minister
మేడమ్​ చీఫ్​ మినిస్టర్

మేడమ్ ఆఫ్​ మినిస్టర్​ సినిమాపై కూడా పలు ఊహాగానాలు వచ్చాయి. అది బీఎస్పీ నాయకురాలు మాయావతి నిజజీవిత ఆధారంగా తీసిన వెబ్​ సిరీస్​ అని అన్నారు. కానీ మాయావతిపై తీసిన కంటెంట్​ కాదని స్వయాన హీరోయిన్ రిచా చద్దా చెప్పినప్పటికీ.. దీనిపై వచ్చిన ఊహాగానాలు మరింత ఆదరణను తీసుకొచ్చాయి. ఒకానొక సందర్భంలో ప్రజలు రాజకీయాల వల్ల ప్రభావితమవుతున్నారు కాబట్టి తను ఆ స్టైల్​ కంటెంట్​పై నటించడానికి ఒప్పుకున్నానని రిచానే చెప్పింది. దీన్నిబట్టి ఈ జానర్​కు ఉన్న క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు.

"న్యూస్ ఎన్నో రకాలుగా ఉంటుంది. ఇది కేవలం మర్డర్​, సెలబ్రిటీ గాసిప్​లు మాత్రమే కాదు. అందులో నేషనల్​ న్యూస్ అందరినీ ప్రభావితం చేస్తోంది. అందుకే పొలిటికల్ డ్రామాలు పాపులర్​ అవుతున్నాయి."

-రిచా చద్దా

ఈ ఫాంటసీ కారణంగా..

ఎక్కడైన అణిచివేత ఉంటే.. దానిని అధిగమించడానికి హీరో పుట్టుకొస్తాడు. అక్కడి నుంచి సామాన్య ప్రజానీకానికి అధికారం, న్యాయం కోసం పోరాటం చేస్తాడు. ఈ రకమైన పోరాటంలో ఏం జరుగుతోంది? ఎలా సాధిస్తాడు? అలాంటి కంటెంట్​ను ప్రజలు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ విషయాన్నే సామాజిక పరిశోధకుడు అంకిత్​ శర్మ తెలిపారు. భావవ్యక్తీకరణను అణిచివేస్తున్న సమాజంలో అధికారం, న్యాయం కోసం పోరాడే చిత్రాలను ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారని వెల్లడించారు.

city of dreams
సిటీ ఆఫ్ డ్రీమ్స్

శృంగారానికి చెల్లు..

ఓ ఐటమ్ సాంగ్​, నాలుగు ఫైట్లు, ఓ రెండు కామెడీ సీన్​లతో సినిమాను ముగిస్తే ప్రేక్షకులు విజిల్స్​ కొట్టే రోజులు పోయాయి. 20వ శతాబ్దానికి బాలీవుడ్​లో వచ్చిన శృంగారభరితమైన సినిమాలు ఇప్పుడు సాధారణమైపోయాయి. వాటికి అంత ఎక్కవ ప్రాధాన్యం ఇవ్వడం లేదు ప్రేక్షకులు. కంటెంట్​కే ఉన్నవాటికే ఎక్కువ ఓట్లు పడుతున్నాయి.

క్రైమ్​కు భిన్నంగా..

'క్రైమ్ ఆధారిత సినిమాలు ఎన్నో వచ్చాయి. వాటికి ఇప్పుడు ఆదరణ తగ్గింది. ఇంకా వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకేనేమో బహుశా ప్రజలు పొలిటికల్ కంటెంట్​ను ఉత్సాహంగా చూస్తున్నారు.'అని యాక్టర్ సచిన్ పిల్గొంకర్​ అన్నారు. 'సిటీ ఆఫ్ డ్రామాస్'​ సినిమాలో సచిన్ ముఖ్యమంత్రి పాత్ర పోషించారు. ఈ పొలిటికల్ డ్రీమ్స్​లో పోరాటం ఉంది. పోరాటంతో కూడిన ఏ సన్నివేశంలోనైనా డ్రామా ఉంటుంది. ప్రేక్షకులకు ఆసక్తిని రేకిత్తిస్తుంది. అందుకే ఈ సినిమాకు అంత ఆదరణ లభించింది.

ఇదీ చదవండి:HC on Movie Tickets: సినిమా టికెట్ల ధరలపై ఏం నిర్ణయం తీసుకున్నారు?

Last Updated : Aug 6, 2021, 11:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.