ETV Bharat / sitara

'పింక్​' రీమేక్​ నుంచి​ ఫస్ట్​లుక్​ వచ్చేది అప్పుడే!

author img

By

Published : Feb 29, 2020, 1:56 PM IST

Updated : Mar 2, 2020, 11:06 PM IST

దాదాపు రెండేళ్ల నుంచి పవన్​ కల్యాణ్​ను తెరపై చూడాలని అతడి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవర్​స్టార్​ ప్రధానపాత్రలో నటిస్తున్న 'పింక్​' రీమేక్​ నుంచి త్వరలో సర్​ప్రైజ్​ రానుంది. తొలిరూపు, తొలిపాట త్వరలోనే విడుదల చేయనున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతోంది.

PINK telugu remake Firstlook and song revealed soon
'పింక్​' రీమేక్​ అప్​డేట్​.. ఫస్ట్​లుక్​ విడుదల తేది ఖరారు..?

పవన్‌ కల్యాణ్​ హీరోగా, వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో.. బాలీవుడ్ మూవీ 'పింక్​' రీమేక్ తెరకెక్కుతోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం.

పవర్​స్టార్​ 26వ చిత్రంపై అభిమానుల్లో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమా అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో.. చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ త్వరలో ఓ పాట విడుదల చేయనున్నట్టు ట్విట్టర్​ వేదికగా తెలిపాడు.

PINK telugu remake Firstlook and song revealed soon
సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న పోస్టర్​

ఫస్ట్​లుక్​.. ఫస్ట్​ సాంగ్​!

ఈ నేపథ్యంలో తాజాగా అభిమానులు పవన్‌ ఫస్ట్‌లుక్‌ గురించి సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 2న పవన్‌ సినిమా ఫస్ట్‌లుక్‌, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఫస్ట్‌సాంగ్‌ను విడుదల చేయనున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఈ చిత్రానికి సంబంధించిన హ్యాష్​ట్యాగ్స్​ సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్​లో ఉన్నాయి.

ఇదీ చూడండి.. మహేశ్​ అభిమానులకు ఒకేరోజు రెండు సర్​ప్రైజ్​లు

Last Updated :Mar 2, 2020, 11:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.