ETV Bharat / sitara

సక్సెస్​ కాంబో రిపీట్​.. పవన్​తో దిల్​రాజు చిత్రం!

author img

By

Published : Apr 22, 2021, 3:28 PM IST

'వకీల్​సాబ్​' చిత్రంతో సూపర్​హిట్​ అందుకున్న నిర్మాత దిల్​రాజు.. పవన్​ హీరోగా మరో చిత్రం నిర్మించేందుకు సిద్ధమయ్యారని టాలీవుడ్​ టాక్​ వినిపిస్తోంది. అందుకు పవర్​స్టార్​ కూడా అంగీకారం తెలిపారని ప్రచారం జరుగుతోంది.

Pawan Kalyan-Dil Raju to collaborate again?
పవన్​తో మరోసారి దిల్​రాజు

మూడేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​.. 'వకీల్​సాబ్'​ చిత్రంతో బ్లాక్​బాస్టర్​ను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్​రాజు నిర్మించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్​లో మరో చిత్రం రానుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు కోసం ఓ డైరెక్టర్​ను వెతికే పనిలో ఉన్నారట దిల్​రాజు.

పవన్​.. ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత దిల్​రాజు ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఇదే నిజమైతే పవన్​ ఫ్యాన్​గా దిల్​రాజుకు మరోసారి కలిసొచ్చినట్లే అంటున్నాయి సినీ వర్గాలు.

ఇదీ చూడండి.. మెగాస్టార్​ అల్లుడు కల్యాణ్​ దేవ్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.