ETV Bharat / sitara

అమెరికా, జపాన్​లలో 'ప్రభాస్'​ చిత్రాలు మళ్లీ విడుదల!

author img

By

Published : Oct 20, 2020, 6:30 PM IST

ఈ శుక్రవారమే.. యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్​ పుట్టినరోజు. ఈ సందర్భంగా అమెరికా, జపాన్​లలోని అతని అభిమానుల కోసం ఓ సంతోషకర వార్త బయటకు వచ్చింది. 'డార్లింగ్​' నటించిన ఓ రెండు చిత్రాలను, అక్కడ మళ్లీ విడుదల చేయనున్నారు. అవేంటో మీరూ చూసేయండి!

pabhas recent two movies will be played in america and japan theaters due to his birthday
అమెరికా, జపాన్​లలో 'ప్రభాస్'​ చిత్రాలు మళ్లీ విడుదల!

ఈ నెల 23న పుట్టినరోజు జరుపుకోనున్నాడు కథానాయకుడు ప్రభాస్​. ఈ సందర్భంగా.. అమెరికా, జపాన్​లోని 'డార్లింగ్'​ అభిమానుల కోసం ఓ తీపి కబురందింది. ప్రభాస్ నటించిన 'సాహో', 'బాహుబలి: ది కంక్లూజన్'​ సినిమాలు.. అక్కడి థియేటర్లలో మళ్లీ విడుదల కానున్నాయి.

కరోనా వ్యాప్తి దృష్ట్యా.. అమెరికా, జపాన్​లలో థియేటర్లు ఇన్నాళ్లూ మూతపడ్డాయి. ఇప్పుడిప్పుడే నిబంధనలను పాటిస్తూ మళ్లీ తెరుస్తున్నారు. 'ప్రభాస్'​ బర్త్​డే నేపథ్యంలో.. అతడి గత రెండు సినిమాలను ఈ వారంతంలో మరోసారి విడుదల చేయాలని నిర్ణయించారు అక్కడి థియేటర్ల యజమానులు.

ప్రభాస్​ కథానాయకుడిగా, ఎస్​.ఎస్​.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'బాహుబలి ది కన్​క్లూజన్​' చిత్రం.. ఎన్నో అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగానూ పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత, సుజీత్​ దర్శకత్వంలో వచ్చిన 'సాహో' చిత్రానికి ఊహించినంత స్పందన రాకపోయినా, వసూళ్ల విషయంలో మాత్రం వెనుకబడిపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.400 కోట్ల కలెక్షన్స్​ని రాబట్టింది.

ఇదీ చూడండి:బాలయ్య 'నర్తనశాల' ఫస్ట్​లుక్ వచ్చేసింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.