ETV Bharat / sitara

స్క్రిప్ట్​ రెడీ.. షూటింగ్​ చేయడమే ఆలస్యం!

author img

By

Published : May 18, 2020, 7:34 AM IST

టాలీవుడ్​ అగ్రకథానాయకులు ప్రభాస్​, ఎన్టీఆర్​లు నటించే కొత్త చిత్రాలకు సంబంధించిన కథలను దర్శకులు పూర్తిగా సిద్ధం చేశారు. స్క్రిప్ట్​ వర్క్​ ఇప్పటికే పూర్తవ్వగా, ప్రస్తుతం వాటికి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు​.

NTR, PRABHAS NEW MOVIE UPDATES
స్క్రిప్ట్​ రెడీ.. షూటింగ్​ చేయడమే ఆలస్యం!

లాక్‌డౌన్‌తో వచ్చిన ఈ విరామంలో కథానాయకులకి కాస్త తీరిక దొరికిందేమో కానీ..దర్శకులకి కాదు. కథల మీద కసరత్తులతో వాళ్లు తీరిక లేకుండా గడుపుతున్నారు. కొత్తగా కథలు మొదలు పెట్టినవాళ్లు కొందరైతే, పూర్తయిన కథలకి తుదిమెరుగులు దిద్దుతున్నవాళ్లు మరికొందరు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్‌ తదుపరి చిత్రం ఎన్టీఆర్‌తో చేయబోతున్నారు. ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్టుకి ప్రస్తుతం త్రివిక్రమ్‌ తుదిమెరుగులు దిద్దుతున్నారు.

అగ్ర కథానాయకుడు ప్రభాస్‌ చేయబోయే కొత్త సినిమా కథని యువ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఎప్పుడో పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ స్క్రిప్టుకి తుదిమెరుగులు దిద్దుతూనే, ప్రి విజువలైజేషన్‌ పనులు చేస్తున్నారు. నటీనటుల విషయంలోనూ ఓ నిర్ణయానికొచ్చామని, అయితే ఎంపిక మాత్రం ఇంకా జరగలేదని నాగ్‌ అశ్విన్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు. కథానాయకులు ఎప్పుడు సిద్ధమైతే అప్పుడు ఆయా సినిమాల్ని పట్టాలెక్కించడానికి దర్శకులు పక్కాగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదీ చూడండి.. 'ఎలా అడుగులు వేయాలో అనుభవాలే నేర్పాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.