ETV Bharat / sitara

స్మార్ట్​ లుక్​లో ఎన్టీఆర్.. ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్

author img

By

Published : May 20, 2021, 9:11 AM IST

యంగ్​టైగర్ ఎన్టీఆర్​ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. గురువారం తారక్​ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్టీఆర్ కొత్త లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం.

ntr
ఎన్టీఆర్​

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, నందమూరి కల్యాణ్‌రామ్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ మిక్కిలినేని నిర్మాతగా వ్యవహరించనున్నారు.

గురువారం తారక్‌ పుట్టినరోజు సందర్భంగా 'ఎన్టీఆర్​30' టీమ్‌ ఓ సరికొత్త ఫొటోను షేర్‌ చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ స్మార్ట్‌ లుక్‌తో ఇన్‌షర్ట్‌ చేసుకుని క్లాసీ, ప్రొఫెషనల్‌గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ యంగ్‌ టైగర్‌ అభిమానుల్ని ఎంతో ఆకట్టుకుంటోంది. అయితే, తారక్‌ తన 30వ చిత్రాన్ని మొదట త్రివిక్రమ్‌తో ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కనపెట్టారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆయన కొమురంభీమ్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్‌చరణ్‌ మరో కథానాయకుడు. ఇందులో ఎన్టీఆర్‌కు జంటగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ సందడి చేయనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్‌.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నారు. అలాగే శివ సైతం ప్రస్తుతం 'ఆచార్య'తో బిజీగా ఉన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.