ETV Bharat / sitara

భన్సాలీతో రణ్​వీర్ కాదు రణ్​బీర్!

author img

By

Published : Sep 3, 2020, 8:37 PM IST

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'బైజూ బవ్రా' అనే చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో రణ్​వీర్ సింగ్ హీరోగా చేయబోతున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఇందులో రణ్​బీర్ కపూర్​ని తీసుకున్నట్లు సమాచారం.

భన్సాలీతో రణ్​వీర్ కాదు రణ్​బీర్!
భన్సాలీతో రణ్​వీర్ కాదు రణ్​బీర్!

1952లో వచ్చిన 'బైజూ బవ్రా' క్లాసిక్ చిత్రానికి రీమేక్ చేయబోతున్నారు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఇందులో రణ్​వీర్ సింగ్ హీరోగా నటించబోతున్నాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాలో హీరో అంటూ మరో కొత్త పేరు వినిపిస్తోంది. రణ్​వీర్ కాదు రణ్​బీర్ కపూర్ లీడ్ రోల్ పోషించబోతున్నాడంటూ ప్రస్తుతం హిందీ పరిశ్రమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

అయితే ఇప్పుడే చిత్రబృందం షూటింగ్ ప్రారంభించే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం హీరోల ఎంపికపైనే దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ చిత్రం వచ్చే ఏడాది జూన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించనుంది. అప్పటికే భన్సాలీ 'గంగూబాయ్​'ని పూర్తి చేస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.