ETV Bharat / sitara

విద్యార్థుల ఆత్మహత్యపై హీరో సూర్య ట్వీట్

author img

By

Published : Sep 14, 2020, 11:41 AM IST

నీట్​ పరీక్ష రాయల్సిన ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం తనను చాలా బాధ కలిగించిందని నటుడు సూర్య చెప్పారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.

NEET exam not only takes away student's opportunities but also their lives - Actor Suriya
సూర్య

నీట్​ పరీక్ష భయంతో ఒకే రోజు ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారనే వార్త తన మనసు కదిలించిందని తమిళ అగ్రహీరో సూర్య ట్వీట్ చేశారు. ఈ సంఘటన తనను చాలా బాధించిందని అన్నారు.

"విద్యార్థులు వారి విలువను నిరూపించుకోవడానికి ఈ పరీక్ష రాయాల్సి వస్తోంది. 'నీట్​' వారి అవకాశాలను దూరం చేయడమే కాకుండా ప్రాణాలునూ తీస్తోంది. ఒక్క పరీక్షతో విద్యార్థి అర్హత, నైపుణ్యాలను లెక్కించడం సరైన పద్ధతి కాదు. నిన్న ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయమై మనం అప్రమత్తంగా లేకపోతే ఇదే పరిస్థితి మళ్లీ మళ్లీ జరుగుతుంది. డాక్టర్​ కావాలన్న విద్యార్థుల కల చెదిరిపోయి సాధారణ కుటుంబాలకు చెందిన అమాయక విద్యార్థులు తనువు చాలిస్తున్నారు. మనమంతా మౌనం వీడాలి. నీట్​ పరీక్షకు వ్యతిరేకంగా మన గళాన్ని వినిపించాలి"

- సూర్య శివకుమార్​, కోలీవుడ్​ నటుడు

వీడియో కాన్ఫరెన్సింగ్​ ద్వారా తీర్పులను ప్రకటిస్తున్న న్యాయమూర్తులు.. విద్యార్థులను నేరుగా పరీక్ష రాయమని ఆదేశించడం ఏంటని సూర్య ప్రశ్నించారు. పరీక్ష కోసం అన్యాయంగా ఆత్మహత్యకు పాల్పడిన వారి తల్లిదండ్రులకు, ఇది జీవిత శిక్షగా మారుతుందని అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.