ETV Bharat / sitara

ఓటీటీలోనే 'టక్ జగదీష్'.. డీల్ కుదిరింది!

author img

By

Published : Aug 6, 2021, 6:31 AM IST

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్'​ ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకోసం అమెజాన్ ప్రైమ్​తో భారీ డీల్ కుదుర్చుకుందట చిత్రబృందం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Tuck Jagadish
టక్ జగదీష్

ఒక వైపు కరోనా భయాలు.. మరోవైపు ప్రదర్శన రంగంలో సమస్యలు.. ఫలితంగా చిత్రసీమ ఉక్కిరిబిక్కిరవుతోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. ధైర్యం చేసి విడుదల చేసినా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చాలడం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ, 50శాతం సామర్థ్యంతో ప్రదర్శనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలకైతే ఓకే కానీ, భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న చిత్రాలకి పెట్టుబడి తిరిగి రాని పరిస్థితి.

ఈ నేపథ్యంలో గత వారం విడుదలైన సినిమాలు అంతంత మాత్రం ఫలితాల్ని రాబట్టాయి. చాలా చోట్ల థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. పెద్ద తెరపై తమ సినిమా చూపించాలని దర్శకనిర్మాతలకి, కథా నాయకులకు ఉన్నా.. పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలంగా లేవు. థియేటర్లలోనే విడుదల చేయాలని ఏడాదికిపైగా ఎదురు చూస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిపై పడుతున్న వడ్డీల భారం అంతా ఇంతా కాదు. భారం ఇన్నాళ్లూ మోస్తూ వచ్చినా... పరిస్థితులు అనుకూలంగా మారడం లేదు. దాంతో చాలామంది నిర్మాతలు భారం దించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటీటీలో విడుదల చేయడంపై మొగ్గు చూపుతున్నారు.

టక్ జగదీష్​ అదే బాట!

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'టక్‌ జగదీష్‌' ఓటీటీలోనే విడుదల కానుందని సమాచారం. ఆ మేరకు నిర్మాతలు, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సంస్థ మధ్య చర్చలు కూడా పూర్తయినట్టు తెలిసింది. రూ. 37 కోట్లకు డీల్‌ కుదిరినట్టు సమాచారం. త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్‌, హిందీ అనువాద హక్కులు కలుపుకొంటే రూ.50 కోట్లపైగానే ఈ సినిమా వ్యాపారం చేసినట్టవుతుందని లెక్కగడుతున్నాయి. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్‌ నాయికలుగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్'​ సెట్​లో తారక్​ ఫొటో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.