ETV Bharat / sitara

మంచుకొండల్లో నేరస్థులతో 'నాగార్జున' పోరాటాలు

author img

By

Published : Oct 21, 2020, 11:02 PM IST

నాగార్జున 'వైల్డ్​ డాగ్'​ సినిమా షూటింగ్​ హిమాలయాల్లో జరుగుతోంది. కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ఈ మధ్యే.. మనాలికి వెళ్లిందీ చిత్ర బృందం.

nagarjuna wild dog movie shooting is going in manali
మంచుకొండల్లో నేరస్థులతో 'నాగార్జున' పోరాటాలు

అక్కినేని నాగార్జున ఎన్ఐఏ అధికారిగా నటిస్తున్న చిత్రం 'వైల్డ్ డాగ్'‌. నూతన దర్శకుడు అహిషర్ సోలమన్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ కోసం‌ మనాలికి వెళ్లింది చిత్రబృందం. అక్కడే కొన్నాళ్లు షూటింగ్‌ జరుపుకోనుందని సమాచారం. లాక్‌డౌన్‌ తరువాత హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ మళ్లీ మొదలైంది. కొన్ని సన్నివేశాలను భాగ్యనగరంలో చిత్రీకరించారు.

ఈ సినిమాలో నాగార్జున ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్ట్‌ విజయ్‌ వర్మగా దర్శనమివ్వబోతున్నారు. నేరస్థులతో వ్యవహరించే అత్యంత కఠినమైన తీరుతో ఆయనను 'వైల్డ్ డాగ్' అని పిలుస్తుంటారు. యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని.. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్​‌‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్‌ లుక్‌ విడుదలై అంచనాలు పెంచింది.

ఇదీ చూడండి:కరోనా తర్వాత ముఖానికి రంగేసిన విద్యాబాలన్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.