ETV Bharat / sitara

బాలీవుడ్​లో కెరీర్​పై నాగ్​ ఏమన్నారంటే?

author img

By

Published : Apr 22, 2021, 5:32 AM IST

దాదాపు 17ఏళ్ల తర్వాత త్వరలోనే 'బ్రహ్మస్త్ర' సినిమాతో బాలీవుడ్​ ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు అక్కినేని హీరో నాగార్జున. తాజాగా హిందీ చిత్రంలో నటించడానికి ఇంత సమయం ఎందుకు తీసుకున్నారో నాగ్​ వివరించారు. బీటౌన్​లో స్థిరపడాలనే ఆలోచన లేనందువల్లనే ఇంత గ్యాప్​ వచ్చిందని చెప్పారు.

nagarjuna
నాగార్జున

టాలీవుడ్ కింగ్​ నాగార్జున.. యువ హీరోలతో దీటుగా వరుస సినిమాలతో దూసుకెళ్తుంటారు. గతంలో పలు హిందీ చిత్రాల్లో నటించి అక్కడి ప్రేక్షకుల్ని పలకరించారు. కానీ ఆ తర్వాత తెలుగు చిత్రాలకే పరిమితమయ్యారు. అయితే ఇప్పుడు దాదాపు 17ఏళ్ల తర్వాత త్వరలోనే 'బ్రహ్మస్త్ర' సినిమాతో మరోసారి బాలీవుడ్​ ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్.. బీటౌన్​లో రీఎంట్రీ ఇవ్వడంపై మాట్లాడారు. బాలీవుడ్​లో స్థిరపడాలనే ఆలోచన లేనందువల్లనే అక్కడి చిత్రాల్లో నటించడానికి ఇంత సమయం పట్టిందని చెప్పారు.

"నా కెరీర్​లో బాలీవుడ్​ ఏ పాత్ర పోషిస్తుందో నాకు తెలీదు. అయినా నేను హిందీ పరిశ్రమను కెరీర్​గా ఎంచుకోవాలనుకోలేదు. నన్ను, నా సినిమాలను బాలీవుడ్​తో పాటు తమిళం, కేరళ, కర్ణాటకలోనూ ఆదరిస్తారు. అందువల్ల నాతో సినిమాలు చేయడం వల్ల నిర్మాతలు ఇంకాస్త ఆర్థికంగా లాభపడతారు. కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి. నా కెరీర్​కు కూడా ఇది ఉపయోగపడుతుంది. కానీ నాకు బాలీవుడ్​లో స్థిరపడాలనే ఆలోచన ఎప్పుడూ రాలేదు" అని నాగ్​ అన్నారు.

'బ్రహ్మస్త్ర'లో రణ్​బీర్​ కపూర్​, ఆలియా భట్​, అమితాబ్​ బచ్చన్​ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.


ఇదీ చూడండి : మే మూడో వారంలో 'వైల్డ్​డాగ్' ఓటీటీ రిలీజ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.