ETV Bharat / sitara

నాగ చైతన్య వ్యాఖ్యలు.. సమంతను ఉద్దేశించేనా?

author img

By

Published : Dec 15, 2021, 6:42 AM IST

Updated : Dec 15, 2021, 8:34 AM IST

Naga Chaitanya on Samantha: నాగచైతన్య-సమంత తమ వివాహ బంధానికి ముగింపు పలికినా.. ఈ జంటపై ఇప్పటికీ ఏదో రకంగా చర్చ నడుస్తూనే ఉంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చైతన్య చెప్పిన మాటలు సమంతను టార్గెట్​ చేసినట్లుగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

naga chaitanya
చైతూ సమంత

Naga Chaitanya on Samantha: నాగచైతన్య- సమంత విడిపోయి రెండు నెలలు అవుతున్నా.. ఏదో ఒక సందర్భంలో ఇప్పటికీ వారి గురించి సోషల్‌ మీడియాలో చర్చ నడుస్తూనే ఉంది. వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌లో మాట్లాడానికి ఇష్టపడని చైతన్య ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

"ఏ పాత్రలు చేయడానికి మీరు ఇష్టపడరు?" అన్న ప్రశ్నకు చైతూ బదులిస్తూ.. "నేను ఏ పాత్ర చేయడానికైనా సిద్ధమే. అయితే అది వ్యక్తిగతంగా, కుటుంబం గౌరవానికి భంగం కలిగేలా ఉండకూడదు. అలాంటి పాత్ర, కథ నా దగ్గరికి వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను" అన్నాడు.

ఈ వ్యాఖ్యలు సమంతను ఉద్దేశించి పరోక్షంగా చేసినవేనంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, అల్లు అర్జున్ నటించిన 'పుష్ప'లో ఓ ప్రత్యేక గీతంలో నటించింది సమంత. అందులో సామ్ హాట్​లుక్స్​కు అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇవీ చూడండి:

Samantha Sick: సినీ నటి సమంతకు అస్వస్థత- హుటాహుటిన ఆస్పత్రికి..

చైతూతో విడాకులు.. ఈ సారి సామ్ ఏం చెప్పిందంటే?

'పుష్ప' స్పెషల్ సాంగ్.. సమంత రచ్చరచ్చ

Last Updated :Dec 15, 2021, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.