ETV Bharat / sitara

మహేశ్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా చైతూ!

author img

By

Published : Jan 6, 2021, 6:32 PM IST

Naga Chaitanya as Mahesh Babu fans Association president in new movie
మహేశ్ అభిమాన సంఘం అధ్యక్షుడిగా చైతూ!

నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చైతూ.. ప్రిన్స్ మహేశ్ బాబు అభిమానిగా కనిపించనున్నట్లు సమాచారం.

సూపర్​స్టార్ మహేశ్​బాబుకు టాలీవుడ్​లోనే కాక నేషనల్ లెవల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. పలు సినిమాల్లో ఆయన క్రేజీని వాడుకున్నారు. తాజాగా నాగచైతన్య కొత్త చిత్రంలోనూ మహేశ్ మేనియా కనిపించనుంది.

Naga Chaitanya as Mahesh Babu fans Association president in new movie
థ్యాంక్యూ షూటింగ్

నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే చిత్రం తెరకెక్కుతోంది. ప్రస్తుతం అబిడ్స్​లోని రామకృష్ణ థియేటర్​గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్కడ జరుగుతోన్న సన్నివేశాలను చూస్తే ఈ సినిమాలో చైతూ.. మహేశ్​ అభిమాన సంఘం అధ్యక్షుడిగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. చిత్రంలో చైతన్య పేరైన అభిరామ్ పేరిట మహేశ్ పోస్టర్లతో బ్యానర్లను ఏర్పాటు చేశారు.

నాగ చైతన్య నటించిన 'లవ్​స్టోరీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.