ETV Bharat / sitara

పాటతో అల్లరి నరేశ్.. ఫస్ట్​లుక్​తో సంపూ

author img

By

Published : Feb 10, 2021, 6:28 PM IST

Naandhi first single and Bazar Rowdy first look released
పాటతో అల్లరి నరేశ్.. ఫస్ట్​లుక్​తో సంపూ

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన 'బజార్ రౌడి' చిత్రం నుంచి ఫస్ట్​ లుక్ విడుదలైంది. అలాగే 'నాంది' నుంచి మొదటి పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం.

ప్రముఖ హాస్యనటుడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు హీరోగా నటిస్తోన్న కొత్త చిత్రం 'బజార్ రౌడి'. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సందిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా మోషన్ పోస్టర్ను చిత్రబృందం హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో విడుదల చేసింది.

Bazar Rowdy first look released
బజార్ రౌడి లుక్

అల్లరి నరేశ్ హీరోగా నటించిన చిత్రం 'నాంది'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు. 'చెలి' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా కారుణ్య, హరిప్రియ ఆలపించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 19న ఈ చిత్రం విడుదల కానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.