ETV Bharat / sitara

ఇండస్ట్రీలో రాజకీయాలు ఎక్కువైపోయాయి: మోహన్​బాబు

author img

By

Published : Oct 16, 2021, 1:33 PM IST

mohan babu about MAA issuemohan babu about MAA issue
మోహన్​బాబు

'మా' రాజకీయ వేదిక కాదని సీనియర్ నటుడు మోహన్​బాబు అన్నారు. త్వరలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలుస్తామని చెప్పారు. విష్ణు.. 'మా' అధ్యక్ష ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​ అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రమాణం స్వీకారం చేశారు. హైదరాబాద్​లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మోహన్​బాబు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మోహన్​బాబు

''మా' లో మేమంతా ఒకే తల్లి బిడ్డలం. కళామతల్లి బిడ్డల్లో ఐక్యత లోపించింది. టీవీలకు వెళ్లి మనుషులను రెచ్చగొట్టొద్దు. ఎన్నికల అధికారి పక్షపాతం లేకుండా వ్యవహరించారు. 'మా' రాజకీయ వేదిక కాదు, కళాకారుల వేదిక. సినీ పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువైపోయాయి. సినీ పరిశ్రమలో గెలుపు ఓటములు సహజం. 'మా' కుర్చీలో కూర్చున్న వ్యక్తిని గౌరవించాలి. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నా. అందరం కలిసి మెలిసి ఉందాం. దేశం గర్వించేలా 'మా'ను తీసుకెళ్లాలి. త్వరలోనే ఏపీ సీఎం జగన్‌ను కూడా కలుస్తాం. విష్ణు మొదట సీఎం కేసీఆర్‌ను కలవాలి. కేసీఆర్ కళాకారులకు ఎంతో సహాయం చేస్తారు. నేను కూడా వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలుస్తాను" అని మోహన్​బాబు చెప్పారు.

"ఇక్కడ విర్రవీగేవాళ్లు చాలా మంది ఉన్నారు.ప్రతిభ తప్ప దయాదాక్షిణ్యాలు సినీ పరిశ్రమలో ఉండవు. ఎవరికీ భయపడకుండా విష్ణుకు ఓటేశారు. నాకు ఎవరి మీదా పగ, ద్వేషం లేదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సినీ పరిశ్రమలో తప్పుబడతారు. ఓటు వేసిన సభ్యులే మాకు దేవుళ్లు. ఓటు వేయని వారిపై కక్షలు, పగలు వద్దు" అని మోహన్​బాబు అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.