ETV Bharat / sitara

పదవుల కోసం అలా మాట్లాడితే లోకువైపోతాం: చిరు

author img

By

Published : Oct 11, 2021, 6:41 AM IST

తాత్కాలికమైన(Chiranjeevi latest movie) పదవుల కోసం విమర్శలు చేసుకుంటే బయట వాళ్లకి లోకువైపోతామన్నారు మెగాస్టార్​ చిరంజీవి. హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని చెప్పారు.

chiru
చిరు

"హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉంటే ఈ పరిశ్రమలో ఎలాంటి వివాదాలు ఉండవు. తాత్కాలికమైన పదవుల కోసం మాటలు అనడం.. అనిపించుకోవడం వల్ల బయట వాళ్లకి లోకువైపోతామ"న్నారు కథానాయకుడు చిరంజీవి. ఆయన ఆదివారం(అక్టోబర్​ 10) హైదరాబాద్‌లో జరిగిన 'పెళ్లి సందడి'(Pellisandadi movie pre release event) విడుదల ముందస్తు వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రోషన్‌, శ్రీలీల జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వ(Raghavendra Rao Pelli Sandadi) పర్యవేక్షణలో రూపొందిన చిత్రమిది. గౌరీ రోణంకి తెరకెక్కించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఈనెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ వేడుకకు చిరంజీవి, వెంకటేష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఈ సందర్భంగా చిరంజీవి(chiranjeevi latest movie) మాట్లాడుతూ.. "బెజవాడలో 'పెళ్లి సందడి' 175రోజుల వేడుకకు నేనే ముఖ్య అతిథిగా హాజరయ్యా. మళ్లీ పాతికేళ్ల తర్వాత ఇప్పుడీ 'పెళ్లి సందడి' వేడుకకు నన్ను ముఖ్య అతిథిగా పిలవడం ఆనందంగా ఉంది. వెంకటేష్‌ నా చిరకాల మిత్రుడు. తన సినిమా బాగుంటే నేను.. నా చిత్రం నచ్చితే తను ఒకరినొకరం అభినందించుకుంటాం. ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం అందరి హీరోల మధ్య ఉండాలి. మన ఆధిపత్యం చూపించుకోవడానికి అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు. అసలు వివాదానికి మూలం ఎవరో గుర్తించి.. అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టగలిగితే మనదే వసుధైక కుటుంబం" అన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వెంకటేష్‌ మాట్లాడుతూ.. "రాఘవేంద్రరావు(Raghavendra Rao Pelli SandaD) లాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. చాలా ఎనర్జీ ఉన్న వ్యక్తి ఆయన. 'పెళ్లి సందడి' బృందానికి నా శుభాకాంక్షలు" అన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. "ఈ చిత్రం మా అన్నయ్య కృష్ణమోహన్‌ కోసం చేశా. అనుకోకుండా ఆయన ఈ చిత్రం చూడకుండానే కాలం చేశారు. ఈ చిత్రంలో నేనూ ఓ చిన్న పాత్ర చేశా" అన్నారు. హీరో రోషన్‌ మాట్లాడుతూ.. "నాన్న సినిమాల్లో పెద్ద హిట్‌ 'పెళ్లి సందడి'(pelli sandadi 2) . ఆయన టైటిల్‌తో హీరోగా నా తొలి చిత్రం రావడం సంతోషంగా ఉంద"న్నారు. కార్యక్రమంలో అల్లు అరవింద్‌, అశ్విని దత్‌, శ్రీకాంత్‌, గౌరీ రోణంకి, శ్రీలీల, కీరవాణి, చంద్రబోస్‌, దీప్తి భట్నాగర్‌, రవళి, బి.గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: PelliSandaD Teaser: 'పెళ్లిసందD' మామూలుగా లేదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.