ETV Bharat / sitara

అఖిల్​ను కంగారు పెడుతోన్న విషయమేంటి?

author img

By

Published : Oct 25, 2020, 1:02 PM IST

Most eligible  bachelor teaser
'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్'​ టీజర్ విడుదల​

యువ నటుడు అక్కినేని అఖిల్​ నటిస్తోన్న 'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్'​ టీజర్ విడుదలైంది. విజయ దశమి సందర్భంగా టీజర్​ను రిలీజ్​ చేసింది చిత్ర యూనిట్.

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో యువ నటుడికి జంటగా నటిస్తోంది పూజా హెగ్దే. గీతా ఆర్ట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

చాకచక్యంగా మాట్లాడుతూ నటుడు అఖిల్​ను కంగారు పెడుతోంది పూజాహెగ్దే. పెళ్లైన తర్వాత తన భర్త తనకు నచ్చినట్లు ఉండాలనే భావంతో ఉన్న హీరోయిన్​ను అఖిల్​ ఎలా ప్రేమిస్తాడు? అనే విధంగా టీజర్​ను ఆసక్తికరంగా మలిచారు దర్శకుడు భాస్కర్​.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:దసరా శుభాకాంక్షలు తెలిపిన సినీ తారలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.