ETV Bharat / sitara

చిన్నారి హత్యాచార ఘటన-మహేశ్ భావోద్వేగ ట్వీట్

author img

By

Published : Sep 15, 2021, 12:26 AM IST

Updated : Sep 15, 2021, 1:19 AM IST

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై భావోద్వేగానికి గురయ్యాడు సూపర్​స్టార్ మహేశ్. నేరస్థులను వెంటనే శిక్షించాలని కోరాడు.

Mahesh Babu
Mahesh Babu

హైదారాబాద్​లో వినాయక చవితి రోజు హత్యాచారానికి గురైన చిన్నారి ఉదంతంపై సూపర్​స్టార్​ మహేశ్ బాబు స్పందించారు. సమాజంలో పడిపోతున్న విలువలకు ఈ నీచమైన ఘటన నిదర్శనమని అభిప్రాయపడ్డారు.

  • The heinous crime against the 6-year old in Singareni Colony is a reminder of how far we have fallen as a society. "Will our daughters ever be safe?", is always a lingering question! Absolutely gut-wrenching.. Cannot imagine what the family is going through!

    — Mahesh Babu (@urstrulyMahesh) September 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన క్రూరమైన దాడి.. మానవ సమాజంగా మనం ఎంతగా దిగజారిపోతున్నాయో గుర్తుచేస్తుంది. అసలు మన బిడ్డలు సురక్షితమేనా? అన్నది ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోవాలా? చిన్నారి కుటుంబం ఇప్పుడు ఎంతటి దుఖంలో మునిగిపోయిందో ఊహించలేం."

- మహేశ్​ బాబు, కథానాయకుడు

నిందితుడిని త్వరగా పట్టుకుని తగిన చర్యలు తీసుకుని, చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నట్టు మహేశ్ ట్వీట్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 15, 2021, 1:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.