ETV Bharat / sitara

Maa elections: జీవిత​పై నటుడు పృథ్వీరాజ్​ ఫిర్యాదు

author img

By

Published : Sep 23, 2021, 5:46 PM IST

'మా' ఎన్నికల్లో(maa elections 2021 date) మరో వివాదం తెరపైకి వచ్చింది. జీవిత రాజశేఖర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఎలక్షన్స్​ అధికారికి లేఖ రాశారు నటుడు పృథ్వీరాజ్. జీవిత ఓటర్లను మభ్యపెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్న ఆయన.. ఆమెపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

maa elections
మా ఎలక్షన్స్​

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల(Maa Elections 2021) సమయం దగ్గరపడటం వల్ల సభ్యుల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ప్రకాశ్ రాజ్ ప్యానల్(maa elections prakash raj panel list) నుంచి జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవిత(maa elections 2021 jeevitha panel).. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు నటుడు పృథ్వీరాజ్​. 'మా' కార్యాలయాన్ని ఎన్నికల ప్రచారం కోసం ఆమె వాడుకుంటున్నారని అన్నారు. ఈ విషయం గురించి లేఖలో ప్రస్తావిస్తూ ఎన్నికల అధికారి కృష్ణమోహన్​కు ఫిర్యాదు చేశారు.

జీవిత ఓటర్లను మభ్యపెడుతున్నారని పృథ్వీరాజ్ లేఖలో ఫిర్యాదు చేశారు.​ గతంలో జనరల్ సెక్రటరీ పదవిలో ఉన్న ఆమె... మళ్లీ అదే పదవికి పోటీ చేస్తూ తాత్కాలిక సభ్యత్వ కార్డులు ఉన్న వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. జీవితపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మంచు విష్ణు ప్యానల్(manchu vishnu maa elections panel) నుంచి వైఎస్ ప్రెసిడెంట్​గా పోటీ చేస్తున్న పృథ్వీరాజ్.. తమ ప్యానల్ ప్రకటించిన కొద్ది సేపటికే ఎన్నికల అధికారికి లేఖ రాయడం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్​లో మరోసారి చర్చకు దారితీసింది.

ఇదీ చూడండి: Maa Elections 2021: మంచు విష్ణు ప్యానల్​కు నరేశ్​ మద్దతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.