ETV Bharat / sitara

'లవ్​స్టోరి' ట్రైలర్​ టైమ్ ఫిక్స్.. హిందీ 'హిట్​' లాంచ్

author img

By

Published : Sep 12, 2021, 3:44 PM IST

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో లవ్​స్టోరి, హిట్ హిందీ రీమేక్, మిషన్ ఇంపాజిబుల్ 7, ప్లాన్ బి చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

movie updates
మూవీ అప్డేట్స్

నాగచైతన్య, సాయిపల్లవి(sai pallavi) జంటగా నటించిన సినిమా 'లవ్​స్టోరి'(love story movie release date). సెప్టెంబరు 24న చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్​ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించగా, ఇప్పుడు ట్రైలర్​ గురించి అప్డేట్ ఇచ్చారు. సోమవారం(సెప్టెంబరు 13) ఉదయం 11:07 గంటలకు ప్రచార చిత్రాన్ని విడుదల చేయనున్నారు. శేఖర్ కమ్ముల 'లవ్​స్టోరి'కి దర్శకుడు.

.
.

'హిట్​' సినిమా హిందీ రీమేక్​(hit hindi remake) పూజా కార్యక్రమం ఆదివారం జరిగింది. చిత్రబృందం ఈ విషయాన్ని వెల్లడించింది. రాజ్​కుమార్ రావ్, సన్యా మల్హోత్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒరిజినల్​ను తీసిన శైలేష్ కుమార్.. రీమేక్​కూ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్​రాజు, టి-సిరీస్ భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

.
.

టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్​ 7'(tom cruise mission impossible 7) షూటింగ్ ఆదివారంతో పూర్తయింది. ఈ విషయాన్ని చెబుతూ ఫొటోలను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది సెప్టెంబరులో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముంది.

.
.

శ్రీనివాసరెడ్డి ప్రధాన పాత్రలో నటించిన థ్రిల్లర్ 'ప్లాన్ బి'(plan b movie). రాజ్​మహీ దర్శకుడు. ఈనెల 17న థియేటర్లలోకి రానుందీ చిత్రం.

.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.