ETV Bharat / sitara

'పరంపర' వెబ్​సిరీస్​లో జగ్గూభాయ్​.. 'బ్రహ్మాస్త్ర' కొత్త అప్డేట్​

author img

By

Published : Dec 15, 2021, 10:42 PM IST

Updated : Dec 15, 2021, 10:55 PM IST

ప్రముఖ నటులు జగపతిబాబు, శరత్​కుమార్​ హాట్​స్టార్​లో ప్రసారమయ్యే వెబ్​సిరీస్​లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా నిర్మిస్తోంది. మరోవైపు 'బ్రహ్మాస్త్ర' మూవీటీమ్​ కొత్త అప్డేట్​ను రిలీజ్​ చేసింది.

jagpati babu
'పరంపర' వెబ్​సిరీస్​లో జగ్గుభాయ్​.. 'బ్రహ్మాస్త్ర' కొత్త అప్డేట్​

ఓటీటీల రాకతో వెబ్​సిరీస్​లకు డిమాండ్​ పెరిగింది. అగ్రనటులు కూడా వెబ్​సిరీస్​లో నటించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. టాలీవుడ్​లోనూ ఈ హవా కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ నటుడు జగపతిబాబు, శరత్​ కుమార్​లు ​కూడా అదే బాటలో కొనసాగుతున్నారు. వీరిద్దరూ కలిసి 'పరంపర' అనే వెబ్​సిరీస్​లో నటించనున్నారు. డిస్నీ హాట్​స్టార్​లో ప్రసారమయ్యే ఈ వెబ్​సిరీస్​కు ఆర్కా మీడియా పతాకంపై బాహుబలి చిత్రాన్ని నిర్మించిన శోభు యార్ల గడ్డ, ప్రసాద్​ దేవినేనిలు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించనున్నారు.

ఈ వెబ్​సిరీస్​లో నాగేంద్రనాయుడు, మోహన్​ రావ్​ పాత్రలను శరత్​కుమార్​, జగపతిబాబులు పోషించనున్నారు. కృష్ణ విజయ్​ ఎల్​-విశ్వనాథ్​ అరిగెలా ఈ వెబ్​సిరీస్​కు దర్శకత్వం వహిస్తున్నారు. జగపతిబాబు ఇదివరకే 'పిట్టకథలు', 'ఘర్షణ' మొదలైన వెబ్​సిరీస్​లలో నటించారు.

నేచురల్​ స్టార్​ నానీ కథానాయకుడిగా నటించిన చిత్రం 'శ్యామ్​సింగరాయ్​'. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలుగా నటించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్​కు విశేష్​ స్పందన లభిస్తోంది. ఈ చిత్రం తమిళ ట్రైలర్​ను గురువారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనుంది చిత్ర బృందం. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.

brahmastra motion poster: బిగ్​బీ అమితాబ్​ బచ్చన్, రణ్​బీర్​ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం 'బ్రహ్మాస్త్ర'. అయాన్​ ముఖర్జీ దరక్శత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్​, మౌనీరాయ్​ కథానాయికలు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్​ను విడుదల చేసింది చిత్ర బృందం.

ఇదీ చూడండి : సమంత 'యశోద'లో వరలక్ష్మి.. 'లైగర్​' కొత్త అప్డేట్

Last Updated :Dec 15, 2021, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.