ETV Bharat / sitara

కీర్తి సురేశ్​ 'గుడ్​లక్ సఖి' రిలీజ్ ఫిక్స్

author img

By

Published : Mar 1, 2021, 9:41 AM IST

కీర్తి సురేశ్​ కొత్త సినిమా విడుదల తేదీ ఖరారైంది. 'గుడ్​లక్ సఖి' టైటిల్​తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 3న థియేటర్లలోకి తీసుకురానున్నారు.

keerthy suresh Goodluck sakhi movie release date announced
కీర్తి సురేశ్​ 'గుడ్​లక్ సఖి' రిలీజ్ ఫిక్స్

'సర్కారు వారి పాట' షూటింగ్​లో బిజీగా ఉన్న కీర్తి సురేశ్.. 'గుడ్​లక్ సఖి'తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది జూన్​ 3న సినిమాను థియేటర్లలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

keerthy suresh Goodluck sakhi movie
గుడ్​లక్ సఖి సినిమాలో కీర్తి సురేశ్

గన్ షూటింగ్ పోటీల నేపథ్య కథతో తీసిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్​ పక్కా పల్లెటూరి యువతిగా కనిపించనుంది. నగేశ్ కూకునూర్ దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సుధీర్​ చంద్ర నిర్మిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్​రాజు సమర్పిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.