ETV Bharat / sitara

అమితాబ్​ షోలో కన్నీరు పెట్టుకున్న స్టార్ హీరో

author img

By

Published : Nov 25, 2021, 3:50 PM IST

అమితాబ్​ 'కౌన్​ బనేగా కరోడ్​పతి 13' షోలో పాల్గొన్న స్టార్ కథానాయకుడు కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతకీ ఏమైంది? ఎందుకు అలా భావోద్వేగానికి గురయ్యాడు?

John Abraham crying
జాన్ అబ్రహం

(kaun banega crorepati 2021) బాలీవుడ్​ స్టార్ హీరో జాన్ అబ్రహం.. 'కౌన్ బనేగా కరోడ్​పతి 13' షోలో కన్నీటి పర్యంతమయ్యారు. తన కొత్త సినిమా 'సత్యమేవ జయతే 2' ప్రచారంలో భాగంగా షోలో పాల్గొన్న అతడు.. కన్నీరు ఆపుకోలేకపోయారు. అందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్​ శుక్రవారం ప్రసారం కానుంది.

(satyameva jayate 2)'సత్యమేవ జయతే 2' హీరోహీరోయిన్లు జాన్ అబ్రహం, దివ్య ఖోస్లా కుమార్.. అమితాబ్​ బచ్చన్ 'కౌన్ బనేగా కరోడ్​పతి 13' షోలో సందడి చేశారు. తనదైన స్టైల్​లో ఎంట్రీ ఇచ్చిన జాన్.. సిక్స్​ ప్యాక్​ చూపించి ఆకట్టుకున్నారు. ఆ తర్వాత చేతి వేలిపై ఫుట్​బాల్​ను తిప్పి మెప్పించారు. ఆ తర్వాత 'ధూమ్' సినిమా అమితాబ్​ ఇంటికి వెళ్లిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు.

"నేను బైక్​పై వస్తే.. అభిషేక్​ను మాత్రం ఈ విషయంలో ప్రోత్సాహించవద్దంటూ నాతో అన్నారు. గుర్తుందా! కానీ అభిషేక్​ కిందకు రాగానే 'వావ్ బైక్ చాలా బాగుందని మాట మార్చేశారు' అని" జాన్ అబ్రహం అప్పటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రోమో చివర్లో కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించారు. దానికి గల కారణం ఏంటనేది తెలియాలంటే ఎపిసోడ్​ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.