ETV Bharat / sitara

'83' చిత్రానికి కపిల్​ ఎంత తీసుకున్నారో తెలుసా?

author img

By

Published : Dec 23, 2021, 10:51 AM IST

kapil dev
కపిల్​ దేవ్​

83 movie: 1983 ప్రపంచకప్​ ఆధారంగా తెరకెక్కిన '83' చిత్రానికి నాటి టీమ్​ఇండియా జట్టు కెప్టెన్​ కపిల్​ దేవ్​ భారీగా ఛార్జ్​ చేశారట. ఇతర జట్టు సభ్యులతో పోలిస్తే అగ్రభాగం కపిల్​కే ఇచ్చింది చిత్రబృందం. ఇంతకీ ఆయన ఎంత తీసుకున్నారో తెలుసా?

83 movie: కపిల్​ దేవ్​ రామ్​లాల్​ నిఖంజ్​.. 1983 క్రికెట్​ ప్రపంచకప్​ తర్వాత దేశమంతటా మారుమోగిన పేరు ఇది. అండర్​డాగ్​గా టోర్నీలోకి అడుగుపెట్టిన టీమ్​ఇండియాను ఛాంపియన్​గా నిలపెట్టారు. కపిల్​ సారథ్యంలో గావస్కర్​, మొహిందర్​ అమర్​నాథ్​ వంటి దిగ్గజాలు అద్భుతమైన ప్రదర్శనలు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే ఈ విజయాన్ని '83' రూపంలో ఇప్పుడు వెండితెరపై చూసే అవకాశం వచ్చింది. ఈ చిత్రం కోసం కపిల్​ దేవ్​ అండ్​ టీమ్​ ఎంత ఛార్జ్​ చేసిందో తెలుసా?

అగ్రభాగం కపిల్​కే..

నాటి టీమ్​ఇండియా ఆటగాళ్లకు చిత్రబృందం రూ. 15 కోట్లను ఇచ్చినట్లు సమాచారం. ఇందులో అగ్రభాగం కపిల్​ దేవ్​కే దక్కింది. ఎందుకంటే ఆయన ఏకంగా రూ. 5 కోట్లను ఛార్జ్​ చేశారు. మిగతా ఆటగాళ్లకు చిత్రబృందం తలో రూ.కోటిని చెల్లించినట్లు తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన ట్రైలర్​కు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కబీర్​ ఖాన్​ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కపిల్​ దేవ్​ పాత్రను రణ్​వీర్​ సింగ్​ పోషించగా ఆయన సతీమణి రోమీ పాత్రలో దీపికా పదుకొణె నటిస్తోంది. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదీ చూడండి : Priyanka chopra: 'స్టార్​డమ్​ పక్కనపెట్టి.. అవకాశాల కోసం అలా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.