ETV Bharat / sitara

హాలీవుడ్​ వెబ్​సిరీస్​ రీమేక్​లో కాజల్​?

author img

By

Published : Jul 28, 2020, 8:22 AM IST

Kajal Aggarwal to feature in upcoming Quantico series remake as the lead
హాలీవుడ్​ వెబ్​సిరీస్​ రీమేక్​లో కాజల్​?

ముద్దుగుమ్మ కాజల్​ అగర్వాల్​.. హాలీవుడ్​ వెబ్​సిరీస్​ 'క్వాంటికో' రీమేక్​లో నటించనుందని సమాచారం. ​ఈ విషయమై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

తన నటన, గ్లామర్​తో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​. ఇప్పటివరకూ సినిమాలతో అలరించిన ఈమె త్వరలో డిజిటల్​ ఫ్లాట్​ఫామ్​పైనా సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. హాలీవుడ్​ సిరీస్​ 'క్వాంటికో' రీమేక్​లో ప్రధాన పాత్ర పోషించనుందని సమాచారం. మాతృకలో ప్రియాంక చోప్రా చేసిన రోల్​ను ఇక్కడ కాజల్ చేయనుందట.

ఈ సిరీస్​ రీమేక్​ను తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

కాజల్.. కమల్ హాసన్​ నటిస్తున్న 'భారతీయుడు 2' లో ప్రస్తుతం నటిస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ​1996లో వచ్చిన 'భారతీయుడు' చిత్రానికి కొనసాగింపుగా దీనిని తెరకెక్కిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.