ETV Bharat / sitara

మరో బడా హీరో సినిమాలో కాజల్!

author img

By

Published : Aug 11, 2020, 5:33 AM IST

మరో పెద్ద హీరో సినిమాలో కాజల్!
మరో పెద్ద హీరో సినిమాలో కాజల్!

హీరోయిన్ కాజల్ అగర్వాల్ కోలీవుడ్ స్టార్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. విజయ్-మురుగదాస్ కాంబినేషన్​లో తెరకెక్కబోతున్న ఓ చిత్రంలో నటించబోతుందని తెలుస్తోంది.

వెండితెరపై తన జోరు చూపించేందుకు సిద్ధమవుతోంది కాజల్ అగర్వాల్. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్​గా ఛాన్స్ కొట్టేసిన ఈ భామ తాజాగా మరో బడా హీరో సినిమాకు ఓకే చెప్పిందని సమాచారం.

కోలీవుడ్​లో విజయ్ సరసన కాజల్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మురుగదాస్​ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా రూపొందబోతుంది. తాజాగా ఈ చిత్రం కోసం కాజల్​ను హీరోయిన్​గా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.

టాలీవుడ్, కోలీవుడ్​ కాక బాలీవుడ్​లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది కాజల్. ప్రస్తుతం సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందుతోన్న 'ముంబయి సాగా' చిత్రంలోనూ నటిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.