ETV Bharat / sitara

ఇన్​స్టాలో కాజల్​కు 15 మిలియన్ ఫాలోవర్లు

author img

By

Published : Sep 5, 2020, 9:05 PM IST

ఇన్​స్టాలో కాజల్​కు 15 మిలియన్ ఫాలోవర్లు
ఇన్​స్టాలో కాజల్​కు 15 మిలియన్ ఫాలోవర్లు

నటి కాజల్ అగర్వాల్ ఇన్​స్టాగ్రామ్​లో ఓ మైలురాయిని చేరుకుంది. ఈ మాధ్యమంలో 15 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకుంది.

హీరోయిన్ కాజల్ అగర్వాల్ సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలకంగా ఉంటుంది. తనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచూ అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన అప్​డేట్స్​ను ఎప్పటికప్పుడు అందిస్తుంది. అందుకే ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే.

తాజాగా కాజల్ ఇన్​స్టాగ్రామ్​లో అరుదైన ఘనత సాధించింది. ఈ డిజిటల్ మాధ్యమంలో 15 మిలియన్ ఫాలోవర్ల మార్క్​కు చేరింది. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రస్తుతం కాజల్.. మెగాస్టార్ చిరంజీవి సరసన 'ఆచార్య'లో నటిస్తోంది. కమల్ హాసన్ 'భారతీయుడు 2'లో ఛాన్స్ కొట్టేసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.