ETV Bharat / sitara

జాతీయ స్థాయిలో మెరిసిన 'జెర్సీ'

author img

By

Published : Mar 22, 2021, 5:02 PM IST

నేచురల్​ స్టార్ నాని నటించిన 'జెర్సీ' చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు లభించింది.

Jersey gets 3 national awards
జాతీయ స్థాయిలో మెరిసిన 'జెర్సీ'.. ఉత్తమ చిత్రంగా గుర్తింపు

నాని నటించిన 'జెర్సీ' జాతీయ ఉత్తమ తెలుగు చలన చిత్రంగా నిలిచింది. కేంద్రం ఈమేరకు 67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను దిల్లీలో ప్రకటించింది.

జెర్సీలో హీరోహీరోయిన్లు నాని, శ్రద్ధా శ్రీనాథ్.. అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా నానికి, తన కుమారుడికి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. గౌతమ్ తిన్ననూరి తన దర్శకత్వ ప్రతిభతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేశాడు. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం.. చిత్రవిజయంలో కీలక పాత్ర పోషించింది.

జెర్సీకి పని చేసిన నవీన్​ నూలికి ఉత్తమ ఎడిటర్‌గా గుర్తింపు లభించింది.

ఇదీ చూడండి: ప్రయత్నిస్తూ ఓడిన 99 మంది కథే 'జెర్సీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.