ETV Bharat / sitara

ఎన్టీఆర్, సమీరాను దించేసిన జపనీస్ జంట

author img

By

Published : Jul 4, 2020, 10:04 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమీరా రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'అశోక్'. ఇందులోని 'గోలా గోలా' పాటకు ఓ జపనీస్ జంట డ్యాన్స్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్​గా మారింది.

Japan NTR fans made video viral
జపాన్ జంట

యంగ్ టైగర్ ఎన్టీఆర్​ తన ఆల్​రౌండ్ నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయనకు జపాన్​ దేశంలోనూ ఫ్యాన్స్​ ఉన్నారు. అక్కడ తారక్ ఫాలోయింగ్​ ఓ రేంజ్​లో ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీకూ అది అర్థమవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఎన్టీఆర్, సమీరా రెడ్డి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'అశోక్'. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలోని 'గోలా గోలా' సాంగ్​కు ఓ జపనీస్ జంట డ్యాన్స్ చేసి అలరించింది. అచ్చం తారక్, సమీరాల్లాగే స్టెప్పులేసి అదరగొట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.