ETV Bharat / sitara

హీరో నాగ చైతన్య తిప్పేశ్వర్​కు వెళ్లాడు.. ఎందుకో తెలుసా?

author img

By

Published : Feb 20, 2021, 2:08 PM IST

Hero Naga Chaitanya went to see the Tippeshwar Sanctuary in Maharashtra
హీరో నాగ చైతన్య తిప్పేశ్వర్​కి వెళ్లాడు.. ఎందుకో తెలుసా?

మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్య అందాలను వీక్షించేందుకు స్నేహితులతో కలిసి హీరో నాగ చైతన్య వెళ్లాడు. విషయం తెలుసుకున్న అభిమానులు సెల్పీలు దిగేందుకు ఎగబడ్డారు.

సినీ హీరో నాగ చైతన్య తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో సందడి చేశారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యాన్ని చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లాడు. విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి భారీగా తరలివచ్చారు.

Hero Naga Chaitanya went to see the Tippeshwar Sanctuary in Maharashtra
అభయారణ్య అందాలు వీక్షిస్తోన్న నాగచైతన్య

తమ అభిమాన హీరోతో ఫొటోలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపారు. అభయారణ్యం అందాలను నాగ చైతన్య వీక్షించారు. ప్రస్తుతం.. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్‌స్టోరీ' విడుదలకు సిద్ధంగా ఉంది. 'థ్యాంక్యూ' చిత్రం విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Hero Naga Chaitanya went to see the Tippeshwar Sanctuary in Maharashtra
అభిమానులతో నాగచైతన్య

ఇదీ చూడండి :నాని పుట్టినరోజున 'డబుల్ బొనాంజా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.