ETV Bharat / sitara

నందమూరి బాలకృష్ణ పాడిన ఆ పాట ఏంటి?

author img

By

Published : Jun 8, 2020, 4:41 PM IST

పుట్టినరోజున బాలకృష్ణ స్పెషల్ సర్​ప్రైజ్
నందమూరి బాలకృష్ణ

కథానాయకుడు బాలకృష్ణ తన 60వ జన్మదినం సందర్భంగా, స్వయంగా పాడిన ఓ పాటను అభిమానులతో పంచుకోనున్నారు. మంగళవారం(జూన్ 9) సాయంత్రం 5:03 నిమిషాలకు దానిని విడుదల చేయనున్నారు.

అభిమానులను సర్​ప్రైజ్​ చేసేందుకు నటసింహం నందమూరి బాలకృష్ణ సిద్ధమవుతున్నారు. జూన్ 10న తన 60వ జన్మదినం నేపథ్యంలో స్వయంగా పాడిన ఓ పాటతో అలరించబోతున్నారు. మంగళవారం సాయంత్రం దానిని విడుదల చేయనున్నారు. అయితే ఆ గీతం ఏమై ఉంటుందా అని అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. దీని గురించి తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నారు.

తన తండ్రి బాలకృష్ణ పుట్టినరోజు నేపథ్యంలో ఆయన కుమార్తె బ్రహ్మణి అభిమానులకు సందేశమిచ్చారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతున్న ఓ వీడియోను అభిమానులు ఇన్​స్టాలో షేర్‌ చేశారు.

'నాన్న అభిమానులకు నమస్కారం.. మీరు నాన్న 60వ జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. అలానే నాన్న వ్యక్తిత్వాన్ని తెలుపుతూ ఎంతో ఆసక్తికరమైన పోస్ట్‌లు, హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండింగ్‌ చేస్తున్నారు. సోషల్‌మీడియాలో వాటిని చూసి చాలా సంతోషించా. భౌతిక దూరం పాటిస్తూ, బాధ్యతగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఏడాది మీ ఇంట్లో, మీ కుటుంబ సభ్యులతో నాన్న జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మీరు నిశ్చయించుకోవడం నాకు అన్నింటికంటే గర్వంగా ఉంది. ఎందుకంటే.. మనం సురక్షితంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వాళ్లూ క్షేమంగా ఉండాలి. అభిమానులు ఎప్పుడూ మా కుటుంబ సభ్యులతో సమానం. నాన్నకున్న క్రమశిక్షణ.. అభిమానులకు రావడం సంతోషించాల్సిన విషయం. ఎల్లప్పుడూ మీ ప్రేమాభిమానాలు మాపై చూపిస్తారని ఆశిస్తున్నా' అని ఇందులో ఆమె చెప్పారు.

బాలయ్య తన 60వ పుట్టినరోజు జరుపుకోనున్న నేపథ్యంలో ముందస్తుగా గత కొన్నిరోజుల నుంచి ఆయన అభిమానులు వేడుకలు జరుపుకుంటున్నారు. పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.