ETV Bharat / sitara

MAA Elections: నరేశ్​, కరాటే కల్యాణిలపై నటి హేమ ఫిర్యాదు

author img

By

Published : Oct 6, 2021, 4:27 PM IST

Updated : Oct 6, 2021, 4:50 PM IST

'మా' ఎన్నికల(MAA Elections 2021) అధికారి కృష్ణ మోహన్​కు నటి హేమ ఫిర్యాదు చేశారు. 'మా' పూర్వ అధ్యక్షుడు నరేశ్​ సహా నటి కరాటే కల్యాణిపై ఫిర్యాదు చేసిన హేమ(Hema MAA Elections).. తన ఫొటోలు మార్ఫింగ్​ చేసి సోషల్​మీడియాలో పోస్ట్​ చేస్తున్నారని ఆరోపించారు.

Hema Complaints Against Naresh And Karate Kalyani to MAA Election Officer Krishna Mohan
మా ఎన్నికలు

మూవీ ఆర్టిస్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల(MAA Elections) నేపథ్యంలో రోజుకో వివాదం తెరపైకి వస్తోంది. ఒకవైపు ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌, మరోవైపు మంచు విష్ణు ప్యానెల్‌ ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సినీ నటి హేమ(Hema MAA Elections) 'మా' మాజీ అధ్యక్షుడు నరేశ్‌, నటి కరాటే కల్యాణిలపై ఎన్నికల అధికారి కృష్ణమోహన్‌కు లేఖ రాశారు. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి, తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

"ఈ నెల 10న జరుగుతున్న ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న నాపై కుమారి కల్యాణి అలియాస్‌ కరాటే కల్యాణి, వి.నరేశ్‌లు కొన్ని అవాంఛితమైన, పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలతో ఒక వీడియోను విడుదల చేశారు. సినీ రంగానికి చెందిన నటీమణుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, వాటికి అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి, కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లలో పోస్ట్ చేస్తున్నారు. గతంలో ఈ విషయమై నేను సైబర్‌సెల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశా. ఆ తర్వాత ఇలాంటి ఘటనలు తగ్గాయి. తాజాగా ఆ ఘటనకు సంబంధించిన విషయాన్ని కల్యాణి ప్రస్తావిస్తూ 'నేను పోలీసుల వద్దకు వెళ్లినప్పుడు వారు నాకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫొటోలను ముందుగా సోషల్‌మీడియా నుంచి తొలగించమని సలహా ఇచ్చినట్లు' వ్యాఖ్యానించారు. కల్యాణి వ్యాఖ్యలను నరేశ్‌ కూడా సమర్థించారు. నేను అమర్యాదకరమైన ఫొటోలను గ్రూపుల్లో పెట్టి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు కూడా తాజా వీడియోలో పేర్కొన్నారు. అంతేకాకుండా అందుకు ఆధారాలున్నాయని, వాటిని బయటపెడతామని బెదిరించారు. నరేశ్‌ వైఖరి నన్ను అగౌరవ పరిచేలా, నా వ్యక్తిత్వాన్ని కించరిచేలా ఉంది. నాపై అసభ్యకరమైన ప్రచారాలు చేయకుండా కట్టడి చేయాలని మిమ్మల్ని కోరుతున్నా. మా ఎన్నికల ప్రచార సమయంలో సంస్థ ప్రతిష్ఠ దిగజారకుండా చూడాల్సిన బాధ్యత సభ్యులందరిపైనా ఉంది. వీరి వల్ల సంస్థకు చెడ్డ పేరు రావటమే కాకుండా, కొందరు సభ్యులు కూడా వీరి ధోరణిని అనుసరించే ప్రమాదం ఉంది. అందువల్ల వారికి ఈసారి ఓటు హక్కు లేకుండా క్రమశిక్షణ చర్యలు తీసుకొమ్మని కోరుతున్నా. కృతజ్ఞతలతో హేమ."

- నటి హేమ లేఖా సారాంశం

దీనికి కారణమైన నరేశ్​, కల్యాణి 'మా' ఎన్నికల్లో ఓటు వేయకుండా చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారికి హేమ విన్నవించుకున్నారు. తనకు సంబంధించిన వీడియోలు తొలగించమని సైబర్​ క్రైమ్​లోనూ ఫిర్యాదు చేసినట్లు నటి హేమ ఈ సందర్భంగా వెల్లడించారు.

నటి హేమ ఫిర్యాదుపై 'మా' ఎన్నికల అధికారి కృష్ణ మోహన్​ స్పందించారు. "కొందరు సభ్యుల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నట్లు తెలిసింది. వ్యక్తిత్వాన్ని కించపరచడం ఎన్నికల నియమావళి ఉల్లంఘనే అవుతుంది. సభ్యులు గౌరవంగా ఎన్నికల ప్రచారం చేసుకోవాలి" అని అన్నారు.

ఇదీ చూడండి.. F3 Movie Shooting: 'ఎఫ్​-3' షూటింగ్​లో బన్నీ సందడి

Last Updated :Oct 6, 2021, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.