ETV Bharat / sitara

'గుడ్​ లక్​ సఖి' కొత్త రిలీజ్​ డేట్​.. 'లాల్​ సింగ్​ చద్ధా' ఆరోజు పక్కా

author img

By

Published : Jan 21, 2022, 5:29 PM IST

స్టార్​ హీరోయిన్​ కీర్తి సురేశ్​ నటించిన లేడీ ఓరియెంటెడ్​ సినిమా 'గుడ్​ లక్​ సఖి'. తాజాగా ఈ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. కాగా.. ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన 'లాల్​ సింగ్ చద్ధా' ముందు ఫిక్స్​ చేసిన తేదీనే విడుదలవుతుందని మరోసారి స్పష్టం చేశారు.

Good Luck Sakhi release
Good Luck Sakhi release

ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్​ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'గుడ్​ లక్​ సఖి'. ఈ చిత్ర విడుదల తేదీలు​ మారిన తీరు చూస్తే.. పేరులో ఉన్న లక్​ లేనట్లు కనిపిస్తుంది. ఎప్పటినుంచో థియేటర్లలో చిత్రం విడుదల చేద్దామనుకుంటున్నారు. కానీ కుదురడం లేదు. విడుదల తేదీలు వరుసగా మారుతూనే ఉన్నాయి.

Good Luck Sakhi release date
'గుడ్​లక్​ సఖి' సినిమా న్యూ రిలీజ్ డేట్

గతేడాది నవంబరు 26న విడుదల చేయలనుకున్నారు కానీ.. కొన్ని రోజులకే ఆ నిర్ణయం మార్చుకున్నారు. డిసెంబరు 10న 'గుడ్​లక్ సఖి' రిలీజ్​ చేస్తామని ప్రకటించారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ డిసెంబరు 31న థియేటర్లలోకి తీసుకొస్తామని పోస్టర్​ విడుదల చేశారు. అప్పుడు కూడా విడుదల కాలేదు. దీంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను చిత్రబృందం కొట్టిపారేసింది. మరో కొత్త రిలీజ్​ డేట్​ను ప్రకటించింది. 'సఖి వచ్చేస్తోంది' అంటూ కీర్తి సురేశ్​ ట్విట్టర్​లో పేర్కొంది. ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్​ షూటర్​ పాత్రలో కనిపించనుంది. ఓ పల్లెటూరి అమ్మాయి జాతీయ స్థాయి షూటర్​గా ఎలా ఎదిగిందనేదే సినిమా

షూటింగ్​ నేపథ్యంగా తీసిన ఈ సినిమాలో కీర్తి సురేశ్.. గిరిజన యువతిగా నటించింది. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. జాతీయ అవార్డు గ్రహీత అయిన నగేశ్​ కుకునూర్ దర్శకత్వం వహించారు.

కేజీఎఫ్​ 2 పోటీగా లాల్​ సింగ్​ చద్ధా

బాలీవుడ్ మిస్టర్​ ఫర్​ఫెక్ట్​ ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ జంటగా నటించిన 'లాల్​ సింగ్ చద్ధా'.. బైసాఖీ కానుకగా ఏప్రిల్ 14న రిలీజ్​ చేయనున్నట్లు చిత్రబృందం మరోసారి వెల్లడించింది. అయితే అదే తేదీన కన్నడ స్టార్ యశ్ నటించిన 'కేజీఎఫ్​ 2' విడుదల కానుండటం వల్ల.. లాల్​ సింగ్​ చద్ధా రిలీజ్​ డేట్​ మారబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తలను చిత్ర బృందం కొట్టిపారేసింది. ముందు నిర్ణయించిన ఏప్రిల్ 14నే సినిమా విడుదలవుతుందని స్పష్టం చేసింది. ఇదే తేదీన విజయ్ నటించిన 'బీస్ట్' కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Lal Singh Chaddha release date
'లాల్​ సింగ్ చద్ధా' సినిమా పోస్టర్​

ఇదీ చూడండి: 'మనీహైస్ట్'​ తరహా వెబ్​సిరీస్​.. తెలుగులో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.