ETV Bharat / sitara

'ఫుల్‌ కిక్‌' ఇస్తోన్న రవితేజ.. 'అమ్మ' పాటతో శర్వానంద్

author img

By

Published : Jan 26, 2022, 6:20 PM IST

ravi teja
khiladi

Ravi Teja Khiladi Movie: కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. ఇందులో రవితేజ నటిస్తోన్న 'ఖిలాడి' సహా శర్వానంద్ కొత్త చిత్రం 'ఒకే ఒక జీవితం' విశేషాలున్నాయి.

Ravi Teja Khiladi Movie: సినీప్రియులకు ఫుల్‌ కిక్‌ అందిస్తానంటూ గణతంత్ర దినోత్సవాన దూసుకొచ్చారు కథానాయకుడు రవితేజ. రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ఖిలాడి'. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయాతి కథానాయికలు. అర్జున్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రంలోని నాలుగో పాటని విడుదల చేశారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

"ఫుల్‌ కిక్‌" అంటూ సాగే ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా, సాగర్‌, మమత శర్మ ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన ఈ మాస్‌ బీట్‌కు శేఖర్‌ మాస్టర్‌ సమకూర్చిన నృత్యాలు అలరిస్తున్నాయి.

మనసును హత్తుకునేలా అమ్మపాట..

శర్వానంద్ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం 'ఒకే ఒక జీవితం'. ఇందులో అక్కినేని అమల, నాజర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టైమ్ ట్రావెల్​ కథతో తీస్తున్న ఈ సినిమాలోని 'అమ్మ' అనే పాటను హీరో అఖిల్ అక్కినేని విడుదల చేశారు. సిద్​ శ్రీరామ్​ ఆలపించిన ఈ గీతం ఎంతో ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో రీతూవర్మ హీరోయిన్​. ఫిబ్రవరిలో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: బాలయ్య-బోయపాటి కాంబోలో మరో రెండు సినిమాలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.