ETV Bharat / sitara

'హే సినామిక' అంటూ దుల్కర్​.. నాని పోస్టర్​ అదుర్స్​

author img

By

Published : Dec 21, 2021, 12:54 PM IST

hey sinamika
shyam singha roy

కొత్త సినిమాల కబుల్లు వచ్చేశాయి. మలయాళ స్టార్​ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కొత్త చిత్రం 'హే సినామిక', సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ 'వరల్డ్​ ఆఫ్​ సేనాపతి' సహా పలు చిత్రాల విశేషాలు ఇందులో ఉన్నాయి.

మలయాళ స్టార్​ నటుడు దుల్కర్​ సల్మాన్ నటిస్తోన్న కొత్త చిత్రం 'హే సినామిక'. కాజల్ అగర్వాల్, అదితీ రావు హైదరీ కథానాయికలు. బృందా దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులోని దుల్కర్​ ఫస్ట్​లుక్​ పోస్టర్​ మంగళవారం విడుదలైంది. తెలుగులో అక్కినేని నాగార్జున, తమిళంలో సూర్య, మలయాళంలో నజ్రియా-ఫాహద్​ సహా రానా దగ్గుబాటి ఈ పోస్టర్​ను రిలీజ్​ చేశారు. జియో స్టూడియోస్, గ్లోబల్​ వన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా.. 2022 ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలకానుంది.

hey sinamika
'హే సినామిక'లో దుల్కర్

టీజర్​తో ఆది..

హీరో ఆది నటిస్తున్న కొత్త సినిమా 'అతిథి దేవోభవ'. మంగళవారం ఈ చిత్ర టీజర్​ విడుదలైంది. ఈ సినిమాకు పొలిమేర నాగేశ్వర్​ దర్శకత్వం వహిస్తుండగా.. నువేక్ష హీరోయిన్​గా నటిస్తుంది. శేఖర్​ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పాటతో శ్రీ విష్ణు..

శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం 'అర్జున ఫల్గుణ'. ఈ చిత్రంలోని 'ఒక తీయని మాటతో' అనే పాట మంగళవారం విడుదలై ఆకట్టుకుంటోంది. తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమృత కథానాయిక.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆకట్టుకుంటున్న సేనాపతి..

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్​ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'సేనాపతి'. 'వరల్డ్​ ఆఫ్ సేనాపతి' అంటూ విడుదలైన వీడియో సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది. పవన్​ సాధినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నరేశ్ అగస్త్య కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆహా ఓటీటీలో డిసెంబర్​ 31 నుంచి ఈ సినిమా ప్రసారం కానుంది. ఈ చిత్రాన్ని విష్ణు ప్రసాద్, సుష్మితా కొణిదెల నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కొత్త పోస్టర్ల కళకళ..

  • నాని హీరోగా నటించిన 'శ్యామ్​ సింగరాయ్'​ చిత్రం డిసెంబర్ 24న విడుదలకు సిద్ధంగా ఉంది. మంగళవారం ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్లు విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్​ సినిమాపై ఆసక్తిని పెంచాయి. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్లుగా నటించారు.
    nani shyam singha roy
    'శ్యామ్​ సింగరాయ్' పోస్టర్
    nani shyam singha roy
    నాని, సాయి పల్లవి
  • మిల్కీ బ్యూటీ తమన్నా పుట్టినరోజు నేడు (డిసెంబర్​ 31). ఈ సందర్భంగా ఆమెకు శుభకాంక్షలు తెలియజేశాయి 'గుర్తుందా శీతాకాలం', 'ఎఫ్​3' చిత్రబృందాలు. ఆమెకు సంబంధించిన కొత్త పోస్టర్లు కూడా రిలీజ్ చేశాయి.
    tamanna
    'గుర్తందా శీతాకాలం'లో తమన్నా
    tamanna
    'ఎఫ్​3'లో తమన్నా

ఇవీ చూడండి:

ఈ క్రిస్మస్​కు థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

'ఆ విషయం 'శ్యామ్​ సింగరాయ్'​ విడుదలయ్యాకే తెలుస్తుంది'

సంక్రాంతి రేసు నుంచి 'భీమ్లా నాయక్' ఔట్.. కొత్త రిలీజ్ డేట్ ఇదే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.