ETV Bharat / sitara

బాలయ్యతో జక్కన్న, కీరవాణి.. సందడి మామూలుగా ఉండదు!

author img

By

Published : Dec 15, 2021, 11:33 AM IST

Rajamouli in Unstoppable with NBK: బాలయ్య టాక్​ షోలో దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ట్వీట్​ చేసింది ఆహా. త్వరలోనే ప్రోమోను విడుదల చేయనున్నట్లు తెలిపింది.

బాలయ్య టాక్​ షోలో రాజమౌళి, కీరవాణి సందడి, Director Rajamouli in Unstoppable with NBK
బాలయ్య టాక్​ షోలో రాజమౌళి, కీరవాణి సందడి

Rajamouli in Unstoppable with NBK: 'అఖండ' సినిమాతో థియేటర్ల దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య.. ఓటీటీలోనూ అదరగొడుతున్నారు. 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్​ షోతో అభిమానుల్ని అలరిస్తున్నారు.

ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్స్​లో మంచు మోహన్​బాబు ఫ్యామిలీ, నాని, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం, డైరెక్టర్ అనిల్ రావిపూడి, అఖండ చిత్రబృందం పాల్గొన్నారు. సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో మరో ఎపిసోడ్​ను తెరకెక్కించారు. ఇప్పుడు తాజాగా ఈ షోకు దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి వచ్చి సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్​ చేసింది ఆహా. త్వరలోనే ప్రోమోను విడుదల చేస్తామని తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు'​ షోలోనూ రాజమౌళి పాల్గొని ప్రేక్షకులను అలరించారు.

Director Rajamouli in Unstoppable with NBK
బాలకృష్ణ, రాజమౌళి
Director Rajamouli in Unstoppable with NBK
రాజమౌళి, కీరవాణి

రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్'​ వచ్చే ఏడాది జనవరి 7న విడుదల కానుంది. యాక్షన్‌, ఎమోషనల్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అల్లూరి సీతరామరాజుగా రామ్‌చరణ్‌, కొమురం భీమ్​గా తారక్‌ నటించారు. ఈ సినిమా విడుదల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై దానయ్య నిర్మించారు. కీరవాణి స్వరాలు అందించారు. ఆలియాభట్‌ , ఒలీవియా మోరీస్‌ కథానాయికలు. శ్రియ, సముద్రఖని, అజయ్‌ దేవ్‌గణ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

Director Rajamouli in Unstoppable with NBK
బాలకృష్ణ
బాలకృష్ణ రాజమౌళి, కీరవాణి, Director Rajamouli in Unstoppable with NBK
బాలకృష్ణ రాజమౌళి, కీరవాణి

ఇదీ చూడండి: విలన్​గా నటించడానికి రెడీ: హీరో బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.