ETV Bharat / sitara

అభిమాని ప్రేమకు ప్రభాస్​ ఫిదా.. స్పెషల్​ గిఫ్ట్​తో సర్​ప్రైజ్​!

author img

By

Published : Nov 17, 2021, 5:40 PM IST

తనపై వినూత్న రీతిలో అభిమానాన్ని చాటుకున్న ఓ ఫ్యాన్​కు అదిరిపోయే గిఫ్ట్​ ఇచ్చి ఆశ్చర్యపరిచారు స్టార్​ హీరో ప్రభాస్​. దానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి.

prabhas
ప్రభాస్​

స్టార్​ హీరో ప్రభాస్​కు(prabhas latest news) ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'బాహుబలి'తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే తాజాగా ఓ ఫ్యాన్​.. ప్రభాస్​పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు. తలపై ప్రభాస్​ అని అక్షరాలు కనిపించేలా గుండు చేయించుకున్నాడు. అతడి అభిమానాన్ని చూసి డార్లింగ్​ ఆశ్చర్యపోయారు(prabhas updates). తనతో సరదాగా కాసేపు ముచ్చటించారు.

prabhas
అభిమానితో ప్రభాస్​

అనంతరం తన వీరాభిమానికి ఖరీదైన వాచ్​ను గిఫ్ట్​గా ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. వీటికి విపరీతంగా లైక్స్​, కామెంట్స్​ వస్తున్నాయి. అయితే ప్రభాస్​.. తన అభిమానులకు బహుమతులు ఇవ్వడం ఇదేం కొత్తేమి కాదు. గతంలోనూ పలువురికి గిఫ్ట్​లు ఇచ్చి సర్​ప్రైజ్​ చేశారు.

prabhas
ప్రభాస్​ ఇచ్చిన గిఫ్ట్​

ప్రభాస్​.. సంక్రాంతికి 'రాధేశ్యామ్'(prabhas radhe shyam movie release date)​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో పాటే(prabhas upcoming movies) 'ఆదిపురుష్'​, 'సలార్'​, 'స్పిరిట్'​, నాగ్​ అశ్విన్​ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

prabhas
అభిమానితో ప్రభాస్​
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'రాధేశ్యామ్'.. రికార్డు స్థాయిలో రిలీజ్​కు ప్లాన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.