ETV Bharat / sitara

మాజీప్రియుడి ఫొటోను డీపీగా పెట్టుకున్న దీపిక..!

author img

By

Published : Nov 29, 2020, 5:05 AM IST

తన సోషల్‌మీడియా ఖాతాలన్నింటికీ మాజీ ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో దిగిన ఓ ఫొటోని ప్రొఫైల్‌ పిక్‌గా ఉంచారు నటి దీపికా పదుకొణె. ట్విటర్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల వేదికగా దీపికను ఫాలో అవుతున్న ఎంతోమంది అభిమానులు ఆమె పెట్టిన డీపీ చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఉన్నట్టుండి ఆమె ఈ విధంగా ఎందుకు చేశారా? అని అందరూ అనుకున్నారు. అయితే దీపిక తన ప్రొఫైల్‌ ఫొటోని మార్చడానికి కారణం లేకపోలేదు..!

deepika has placed her boyfriend photo as her social media account dp
మాజీప్రియుడి ఫొటోను డీపీగా పెట్టుకున్న దీపిక..!

నటి దీపికా పదుకొణె తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. తన సామాజిక మాధ్యమ ఖాతాలన్నింటికీ మాజీ ప్రియుడి రణ్‌బీర్‌ కపూర్‌తో దిగిన ఓ ఫొటోని పెట్టారు. అయితే.. అలా పెట్టడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. అదేంటంటే..

deepika has placed her boyfriend photo as her social media account dp
దీపికా పదుకొణె

ఇంతియాజ్‌ అలీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి ఆమె నటించిన లవ్‌ డ్రామా 'తమాషా'. 2015లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టడమేగాక, రణ్‌బీర్‌-దీపికలకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో దీపిక.. 'తార' అనే అమ్మాయిగా నటించి సినీ ప్రేమికుల్ని ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదలై(నవంబర్‌ 27) ఈ ఏడాదితో ఐదేళ్లు అవుతున్న సందర్భంగా 'తమాషా' పోస్టర్‌ని దీపిక తన సోషల్‌మీడియా ఖాతాలకు డీపీగా మార్చారు. అంతేకాకుండా తన ప్రొఫైల్‌ పేరుని 'తార'గా పెట్టారు. ఈ విషయం తెలిసిన కొంతమంది నెటిజన్లు 'తమాషా' సినిమాకి ప్రశంసల వర్షం కురిపిస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఏం జరిగిందా? అని మాట్లాడుకుంటున్నారు.

deepika has placed her boyfriend photo as her social media account dp
తమాషా పోస్టర్​

గతంలో దీపికా పదుకొణె-రణ్‌బీర్‌ కపూర్‌ రిలేషన్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో వీరిద్దరూ విడిపోయారు. ఈ క్రమంలోనే దీపికకు రణ్‌వీర్‌సింగ్‌తో పరిచయం ఏర్పడడం.. అది కాస్తా స్నేహంగా మారడం జరిగింది. అనంతరం ప్రేమలో పడిన రణ్‌వీర్‌-దీపిక 2018లో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

ఇదీ చూడండి:దీపిక.. అందాల చంద్రిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.