ETV Bharat / sitara

దాదాసాహెబ్​ ఫాల్కే పురస్కార​ వేడుకకు ముహూర్తం ఖరారు

author img

By

Published : Dec 2, 2020, 6:21 PM IST

Updated : Dec 2, 2020, 6:59 PM IST

ముంబయి వేదికగా వచ్చే ఏడాది దాదా సాహెబ్​ ఫాల్కే సినీ పురస్కారాల వేడుకను నిర్వహించనున్నారు. ఇదే విషయాన్ని అవార్డుల సీఈఓ అభిషేక్​ మిశ్రా అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.

Dadasaheb Phalke International Film Festival Awards to be held on February 20, 2021
దాదా సాహెబ్​ ఫాల్కే పురస్కార​ వేడుకకు ముహూర్తం ఖరారు

దాదా సాహెబ్​ ఫాల్కే అంతర్జాతీయ సినీ పురస్కారాల వేడుకను వచ్చే ఏడాది జరపనున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. ముంబయి వేదికగా వచ్చే ఫిబ్రవరి 20న నిర్వహిస్తామని బుధవారం విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలియజేశారు.

"వచ్చే ఏడాది ఫిబ్రవరి 20న దాదాసాహెబ్​ ఫాల్కే అవార్డుల వేడుకను నిర్వహించనున్నాం. ఈ విషయం చెప్పడం మాకెంతో ఆనందంగా ఉంది. 2020 ప్రతి ఒక్కరికీ ఎంతో కష్టంగా ఉంది. అయినప్పటికీ మా బృందంతో కలిసి ఈ వేడుకను విజయవంతంగా జరపడానికి కృషి చేస్తున్నాం. కచ్చితంగా ఇది హుషారుగా ఉండనుంది" అని ఈవెంట్ సీఈఓ అభిషేక్​ మిశ్రా చెప్పారు.

దాదా సాహెబ్​ ఫాల్కే అంతర్జాతీయ ఫిల్మ్​ ఫెస్టివల్​ అవార్డుల వేడుకను 2012 నుంచి నిర్వహిస్తున్నారు. ఈ పురస్కారానికి అనిల్ మిశ్రా ఆద్యుడు. దేశంలో అత్యున్నత సినీ పురస్కారంగా పరిగణించే ఈ అవార్డుల వేడుకను భారతీయ సినీ అతిరథ మహారథుల సమక్షంలో జరుపుతారు.

Last Updated :Dec 2, 2020, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.