ETV Bharat / sitara

ఉత్తమ నటుడు 'ఏజెంట్​ ఆత్రేయ'.. ఉత్తమ చిత్రం 'జెర్సీ'

author img

By

Published : Jan 1, 2021, 5:52 PM IST

దాదా సాహెబ్​ ఫాల్కే(సౌత్​)-2020 అవార్డు గ్రహీతల్లో టాలీవుడ్​ స్టార్స్ దుమ్ములేపారు. ఇందులో 'జెర్సీ', 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ', 'డియర్ కామ్రేడ్', 'సాహో' సినిమాలను పురస్కారాలు వరించాయి.

dada saheb phalke award 2020 south announced
ఉత్తమ నటుడు 'ఏజెంట్​ ఆత్రేయ'.. ఉత్తమ చిత్రం 'జెర్సీ'

గతేడాదికి సంబంధించిన 'దాదా సాహెబ్​ ఫాల్కే-సౌత్' పురస్కార గ్రహీతలను శుక్రవారం ప్రకటించారు. ఈ విషయాన్ని నటుడు నవీన్​ పొలిశెట్టి ఫేస్​బుక్​లో పంచుకున్నారు. ఉత్తమ చిత్రంగా నాని 'జెర్సీ' నిలవగా.. 'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' నటనకుగానూ ఉత్తమ కథానాయకుడిగా నవీన్​ పోలిశెట్టి ఎంపికయ్యారు. ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగాల అవార్డులను వెల్లడించారు. మోస్ట్​ వెర్సటైల్​ యాక్టర్​గా 'కింగ్'​ నాగార్జున నిలిచారు.

dada saheb phalke award 2020 south announced
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు (సౌత్​) -2020

దాదా సాహెబ్​ ఫాల్కే పురస్కారాలు (సౌత్​)- 2020

ఉత్తమ చిత్రం - జెర్సీ (2019)

ఉత్తమ నటుడు - నవీన్​ పోలిశెట్టి (ఏజెంట్​ సాయిశ్రీనివాస ఆత్రేయ)

ఉత్తమ నటి - రష్మిక మంధాన (డియర్​ కామ్రేడ్​)

ఉత్తమ దర్శకుడు - సుజిత్​ (సాహో)

ఉత్తమ సంగీత దర్శకుడు - ఎస్​.ఎస్​.తమన్

మోస్ట్​ వెర్సటైల్​ యాక్టర్​ - అక్కినేని నాగార్జున​

ఇదీ చూడండి: 'అర్జున్ రెడ్డి' దర్శకుడి కొత్త సినిమా.. ఓటీటీలోనే 'దృశ్యం 2'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.