ETV Bharat / sitara

'విజయ్​​.. ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దు'

author img

By

Published : May 5, 2020, 2:14 PM IST

Updated : May 5, 2020, 2:21 PM IST

అసత్య వార్తలను పట్టించుకోవద్దని విజయ్​ దేవరకొండకు మెగాస్టార్​ చిరంజీవి సూచించారు. వ్యక్తిగత అభిప్రాయాలను వార్తలుగా రాయొద్దంటూ జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా మెగాస్టార్ పంచుకున్నారు.

Chiranjeevi responds on Vijay Devarakonda Video
'విజయ్​​... ఇలాంటి వార్తలను పట్టించుకోవద్దు'

ఈ మధ్య కాలంలో తనపై కొన్ని వెబ్​సైట్లు అసత్య వార్తలు రాస్తున్నాయని విజయ్ దేవరకొండ తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అనంతరం పలువురు ప్రముఖులు అతడికి బాసటగా నిలిచారు. ఈ క్రమంలోనే స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటువంటి వాటిని పట్టించుకోవద్దని విజయ్​కు సూచించారు. తనకు అండగా ఉంటామని ట్వీట్ చేశారు.

  • డియర్ విజయ్@TheDeverakonda మీ ఆవేదన నేను అర్ధం చేసుకోగలను.బాధ్యతలేని రాతల వల్ల,మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.We stand by you. Pl don't let anything deter ur spirit to do good.Humbly request Journo friends not to peddle individual views as news.#KillFakeNews

    — Chiranjeevi Konidela (@KChiruTweets) May 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"డియర్‌ విజయ్‌.. మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి బాధ్యతలేని వార్తల వల్ల మీరేకాదు నేను, నా కుటుంబ సభ్యులు బాధపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయినా సరే నీవు చేసే మంచి పనులు ఎప్పటికీ ఆపొద్దు" అంటూ మద్దతు రాసుకొచ్చారు చిరు. జర్నలిస్టులు సూచన చేసిన మెగాస్టార్... వ్యక్తిగత అభిప్రాయాలను వార్తలుగా రాయొద్దని చెప్పారు.

Last Updated : May 5, 2020, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.