ETV Bharat / sitara

బీస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్​.. కేజీఎఫ్-2కు పోటీగా..

author img

By

Published : Mar 22, 2022, 12:05 PM IST

Vijay Beast Release date: నెల్సన్‌ దిలీప్​కుమార్ దర్శకత్వంలో విజయ్​ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా 'బీస్ట్‌' ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర బృందం ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది.

Vijay Beast Release
బీస్ట్

Vijay Beast Release date: తమిళ స్టార్ హీరో విజయ్​ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా 'బీస్ట్‌'. పూజా హెగ్డే హీరోయిన్​. నెల్సన్‌ దిలీప్​కుమార్​ దర్శకుడు. వచ్చే నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందీ చిత్రం. ఈ మేరకు చిత్ర బృందం ట్విట్టర్​ వేదికగా తెలిపింది.

Beast
బీస్ట్

ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని 'అరబిక్​ కుతు' సాంగ్​ ఎంతగా హిట్​ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా శ్రోతలను ఊర్రూతలూగించింది. సోషల్​మీడియాలో రికార్డులు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఇప్పుడు మరో సాంగ్​ విడుదలైంది. 'జాలీ ఓ జిమ్ఖానా' అంటూ సాగే ఈ సాంగ్​ను హీరో విజయ్​ స్వయంగా ఆలపించడం విశేషం. అనిరుధ్‌ రవిచందర్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

కాగా, కేజీఎఫ్-2 సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో రెండు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఢీకొట్టబోతున్నాయి.

ఇదీ చదవండి: సోషల్ మీడియాలో రాజమౌళి ఫాలో అయ్యేది ఆ ఒక్కరినే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.