ETV Bharat / sitara

లాక్​డౌన్​ అనుభవాలతో అనుపమ్ ఖేర్​ పుస్తకం​

author img

By

Published : Nov 6, 2020, 4:56 PM IST

Updated : Nov 6, 2020, 6:46 PM IST

Anupam Kher announces book on Covid experiences
లాక్​డౌన్​ అనుభవాలతో అనుపమ్​ ఖేర్ పుసక్తం​

లాక్​డౌన్​ అనుభవాలతో ఓ పుస్తకాన్ని రాసిన నటుడు అనుపమ్​ ఖేర్​.. కరోనా ప్రభావం వల్ల జరిగిన కొన్ని సానుకూల అంశాలను అందులో ప్రస్తావించినట్లు తెలిపారు. త్వరలోనే దీనిని విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

కరోనా విరామ సమయంలో తన అనుభవాలన్నీ కలిపి ఓ పుస్తకాన్ని రాసినట్లు బాలీవుడ్​ సీనియర్ నటుడు అనుపమ్​ ఖేర్​ చెప్పారు. దీనిని త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.

"కరోనా మహమ్మారి మన జీవితాలను పూర్తిగా మార్చేసింది. మనలోని సంకల్పశక్తి, సానుకూల దృక్పథంతో పాటు ఆలోచన శక్తిని పెంచింది. ఇలాంటి భావాలన్నింటిని కూర్చి లాక్​డౌన్​లో ఓ పుస్తకం రాశాను. త్వరలోనే దీనిని విడుదల చేయనున్నాం. లాక్​డౌన్​లో మనం నేర్చుకున్న విషయాలు భవిష్యత్​ తరాలకు ఉపయోగపడవచ్చు"

- అనుపమ్​ ఖేర్​, బాలీవుడ్​ నటుడు

కొన్నిరోజుల క్రితం తన తల్లితో పాటు సోదరుడి కుటుంబమంతా వైరస్​ బారిన పడినట్లు అనుపమ్ ఖేర్ తెలిపారు. "లాక్​డౌన్​ మధ్యలో న్యూయార్క్​ నుంచి ముంబయి వచ్చాను. దాదాపు 8 నెలలు అక్కడే ఉన్నాను. అదే సమయంలో ప్రజలంతా ఒక తాటిపైకి వచ్చి వైరస్​పై పోరాడంట చూశాను. నా కుటుంబం కూడా అనారోగ్యానికి గురైంది. ఈ మహమ్మారి కారణంగా మనమందరం చాలా కొత్త విషయాలను నేర్చుకున్నాం. మొదట్లో నేను భయపడ్డాను. అభద్రతాభావంతో ఉన్నాను. కానీ, అదే సమయంలో కుటుంబమంతా ఒకచోటకు వచ్చామనే విషయాన్ని గ్రహించినట్లు తెలుసుకున్నాను" అని అనుపమ్ ఖేర్​ తెలిపారు. ఈ పుస్తకం సానుకూల అంశాలను ప్రస్తావిస్తుందని తెలిపారు.

Last Updated :Nov 6, 2020, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.